అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ
Actor ProfilePolitician

అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ
TeluguOne27 Aug 2026
అరెస్టు నుంచి కొడాలి నానికి కోర్టు మధ్యంతర ఉత్తర్వుల రక్షణ

వైసీపీ హయాంలో బూతుల మంత్రిగా గుర్తింపు పొందిన కొడాలి నాని.. ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో పలుమార్లు గీత దాటారు. ప్రత్యర్థులపై బూతుల పంచాగంతో విరుచుకుపడటమే కాకుండా, పలు కబ్జాలు, దాడుల కేసులలో కూడా ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఇందుకు సంబంధించి ఆయనపై కేసులు కూడా నమోదయ్యాయి. ముఖ్యంగా ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లక్ష్యంగా కొడాలి నాని పలు సందర్భాలలో అనుచిత, వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, నాని పాత కేసుల ఫైళ్లు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. వైసీపీ హయాంలో చేసిన వ్యాఖ్యలు, చేష్టలపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. తాజాగా 2021 స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో నాటి ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్, చంద్రబాబులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు కొడాలి నానిపై అప్పట్లో నమోదైన కేసులో చర్యలు తీసుకునేందుకు పోలీసలు సిద్ధమయ్యారు. దీంతో కొడాలి నాని అరెస్టు ఖాయమన్న అభిప్రాయం రాజకీయవర్గాలలో వ్యక్తం అయ్యింది. కానీ, ఆ కేసులో తన అరెస్టుకు రంగం సిద్ధమౌతోందని తెలియగానే.. కొడాలి నాని అప్రమత్తమయ్యారు. హైకోర్టును ఆశ్రయించి అరెస్టు చేయకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఐదేళ్ల నాటి పాత కేసులో ఇప్పుడు అంత అర్జెంటుగా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు.. ప్రస్తుతానికి కొడాలి నానిని అరెస్ట్ చేయవద్దని పోలీసు శాఖను ఆదేశించింది. దీనితో తక్షణ అరెస్టు నుంచి బయటపడ్డారు. కాగా వైసీపీ హయాంలో హద్దులు దాటి దూషణలు, దాడులు, కబ్జాలకు పాల్పడిన కేసుల్లో పలువురు వైసీపీ నాయకులు కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన అరెస్టు అయ్యారు. అయితే కొడాలి నాని మాత్రం ఆ కేసులలో అరెస్టు కాకుండా పదేపదే బయటపడుతుండటం విశేషం. కొడాలి నాని గతంలో ఒక సారి ఆరోగ్య సమస్యల కారణంగా అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. మెడికల్

అర స ట న చ క డ ల న న క క ర ట మధ య తర ఉత తర వ ల రక షణ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in