అయోధ్య విరాళాల అక్రమాల
Actor ProfilePolitician

అయోధ్య విరాళాల అక్రమాల

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య విరాళాల అక్రమాలపై సుప్రీంలో కొత్త పిటిషన్
SkyC Media5 Jul 2026
అయోధ్య విరాళాల అక్రమాలపై సుప్రీంలో కొత్త పిటిషన్

అయోధ్య రామ మందిర విరాళాల వ్యవహారం ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనంగా మారింది. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలోని ఆలయ నిధులు, బహుమతుల నిర్వహణలో భారీగా ఆర్థిక అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సుప్రీం కోర్టులో సోమవారం కొత్త పిటిషన్ దాఖలైంది. భక్తులు సమర్పించిన కానుకలు దుర్వినియోగం అయ్యాయనే అంశంపై తక్షణమే ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని పిటిషనర్లు కోరారు. సీబీఐ నేతృత్వంలోని మల్టీ-డిసిప్లినరీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ద్వారా సమగ్ర, సమయబద్ధమైన దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు. న్యాయవాదులు అజయ్ కుమార్ రాయ్, దినేష్ కుమార్ యాదవ్ ఈ సంచలన పిటిషన్‌ను అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేశారు. రామ మందిర ట్రస్ట్ నిర్వహణ పూర్తిగా అపారదర్శకంగా సాగుతోందని వారు తమ పిటిషన్‌లో తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆలయ ప్రాంగణంలోని విరాళాల పెట్టెల నుంచి పెద్ద ఎత్తున నగదు అదృశ్యమైందని ఇటీవల వచ్చిన వార్తలను వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇలాంటి ఆర్థిక అనియమాలు మందిర నిర్మాణం కోసం తమ కష్టార్జితాన్ని ఇచ్చిన కోట్లాది మంది భక్తుల భావోద్వేగాలను తీవ్రంగా గాయపరుస్తున్నాయని హైలైట్ చేశారు. ఈ నిధుల వివాదం గత కొన్ని వారాలుగా దేశ రాజకీయాన్ని పూర్తిగా హీటెక్కించింది. సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ వంటి ప్రధాన ప్రతిపక్షాలు ట్రస్ట్‌లో భారీ మొత్తంలో విరాళాలు అదృశ్యమయ్యాయంటూ తీవ్రస్థాయిలో టార్గెట్ చేశాయి. ఈ నేపథ్యంలోనే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం మూడు సభ్యులతో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ను ఏర్పాటు చేసి దర్యాప్తునకు ఆదేశించింది. ట్రస్ట్ స్వయంగా అభ్యర్థించడంతో రంగంలోకి దిగిన ఈ ఎస్‌ఐటీ.. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలోని సీసీటీవీ ఫుటేజ్, అకౌంటింగ్ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించింది. ప్రస్తుతం జరుగుతున్న ఈ విచారణలో కొంతమంది ఉద్యోగులతో పాటు ట్రస్ట్ సభ్యుడు చాంపత్ రాయ్, ఇతరులపై దర్యాప్తు సంస్థలు ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇదిలా ఉండగా, ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం వేసిన ఎస్‌ఐటీ దర్యాప్తు ఏమాత్రం

అయ ధ య వ ర ళ ల అక రమ ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in