అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే
Actor ProfilePolitician

అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే

📊 Box Office Collections
Total News2
Movie Updates0
Sources1
పోలియో చుక్కలు వేసి.. బొమ్మలు కూడా ఇచ్చిన సీఎం విజయ్
Eenadu8 Aug 2026
పోలియో చుక్కలు వేసి.. బొమ్మలు కూడా ఇచ్చిన సీఎం విజయ్

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ (CM Vijay) రాష్ట్రవ్యాప్తంగా పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని ఆదివారం ప్రారంభించారు. పాలవాక్కంలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటు చేసిన శిబిరంలో చిన్నారులకు సీఎం పోలియో

అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే
Eenadu5 Aug 2026
అయోధ్య విరాళాలన్నీ సురక్షితమే

అయోధ్య: భక్తులు అయోధ్యలోని రామాలయానికి ఇచ్చిన కానుకలు, విరాళాలు, వెండి ఇటుకలు, ఆభరణాలు సురక్షితంగానే ఉన్నాయని ‘రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు’ స్పష్టంచేసింది. ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్, ట్రస్టీ అనిల్‌ మిశ్రలు రాజీనామా చేయడం వాస్తవమేనని ధ్రువీకరించింది. వాటిపై ట్రస్టు తదుపరి సమావేశంలో నిర్ణయం తీసుకుంటామంది. ఆలయంలో వెలుగుచూసిన ఘటనలు దిగ్భ్రాంతికరం, విచారకరమని ట్రస్టు కోశాధికారి గోవింద్‌ దేవ్‌ గిరి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.. ‘‘రామ మందిరానికి ఇచ్చిన కానుకలన్నింటికీ రికార్డులు పక్కాగా ఉన్నాయి. భక్తుల విశ్వాసాన్ని తిరిగి చూరగొనేలా నిష్పాక్షిక విచారణకు ట్రస్టు నుంచి అన్నివిధాలా సహకారం ఉంటుంది. హుండీల ద్వారా వచ్చిన డబ్బు దుర్వినియోగం అయిందన్న ఆరోపణలపై యూపీ ప్రభుత్వం నియమించిన సిట్‌ నుంచి మధ్యంతర నివేదిక రాగానే ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయించాం. ఇలాంటి ఘటనలు ఇకమీదట జరగబోవనిహామీ ఇస్తున్నాం’’ అని ట్రస్టు పేర్కొంది. లఖ్‌నవూ: భక్తుల నుంచి అందిన విరాళాలను నిర్వహించడంలో, కానుకలు లెక్కించడంలో ప్రామాణిక నిర్వహణ పద్ధతి (ఎస్‌వోపీ)ని అయోధ్య రామాలయం విషయంలో పాటించలేదని ‘ప్రత్యేక దర్యాప్తు బృందం’ (సిట్‌) గుర్తించింది. ఎంత మొత్తాన్ని ఎలా పక్కదారి పట్టించారనే వివరాలపై దర్యాప్తు కొనసాగుతుండగా ఆలయంలో పలు తప్పుల్ని సిట్‌ ప్రాథమిక నివేదికలో ప్రస్తావించింది. కానుకలు లెక్కిస్తున్నప్పుడు సెక్యూరిటీ గార్డును ఉంచడం, పరకామణి లోపలకు సిబ్బంది వెళ్లేటప్పుడు.. వచ్చేటప్పుడు తనిఖీ చేయడం, సీసీటీవీ ఫుటేజీని 180 రోజులపాటు భద్రపరచడం.. ఇలాంటివేవీ జరగలేదని గుర్తించింది. ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ మాజీ డ్రైవరు రామశంకర్‌ యాదవ్‌ వద్ద అనేక హుండీల తాళాలు ఉండేవని, ఇది నిబంధనలకు విరుద్ధమని తప్పుబట్టింది. దీనివల్లనే కానుకలు చోరీ అయ్యాయని అభిప్రాయపడింది. ట్రస్టులోని ‘కీలక వ్యక్తి’ సిఫార్సు మేరకు హుండీ ఆదాయ లెక్కింపునకు బాధ్యునిగా సుభాష్‌ శ్రీవాస్తవను నియమించారని గుర్తించింది. ముంబయి, వయనాడ్‌: హిందువుల మనోభావాలతో ఆటలాడుకుంటూ వారిని భాజపా వంచిస్తోందని శివసేన-యూబీటీ అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే మహారాష్ట్రలోని

అయ ధ య వ ర ళ లన న స రక ష తమ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in