అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు
Actor ProfilePolitician

అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు
Oneindia Telugu26 Jul 2026
అయోధ్య రామమందిరం చోరీలో అనూహ్య మలుపు

అయోధ్య రామమందిర నిర్మాణాన్ని పర్యవేక్షించిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌లో తీవ్ర కలకలం రేగింది. ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మరో సభ్యుడు అనిల్ మిశ్రా తమ తమ పదవులకు రాజీనామా చేశారు. ఆలయానికి వచ్చే చందాలు, కానుకలను చోరీ చేయడం, వాటిని దారిమళ్లించారనే ఆరోపణల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. ఈ ఘటనలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్నాయి. ఈ ఊహించని రాజీనామాలతో అయోధ్య రామమందిర వ్యవహారం సరికొత్త మలుపు తిరిగింది.రామ మందిరం విరాళాల చోరీకి సంబంధించిన అంశంలో గత కొంతకాలంగా తీవ్ర చర్చ నడుస్తోంది. దీనిపై ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం నిష్పక్షపాతంగా లోతైన విచారణ జరిపించింది. సిట్ సమర్పించిన నివేదిక ఆధారంగా పోలీసులు అధికారికంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ పరిణామంతో చంపత్ రాయ్, అనిల్ మిశ్రాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో చివరకు వారు తమ పదవులను వదులుకోవాల్సి వచ్చింది.రామమందిర నిధుల దుర్వినియోగం, దారిమళ్లింపు వ్యవహారంలో పోలీసులు శరవేగంగా చర్యలు చేపట్టారు. సిట సేకరించిన ప్రాథమిక సాక్ష్యాధారాల ప్రకారం, ఈ లూటీతో ప్రత్యక్ష సంబంధం ఉన్న ఎనిమిది మంది నిందితులను గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు తీవ్రత దృష్ట్యా నేడు నిందితులను కోర్టు ముందు ప్రవేశపెట్టేందుకు పోలీసులు అన్ని రకాల ఏర్పాట్లు ముమ్మరం చేశారు. మొహర్రం పండుగ పురస్కరించుకుని కోర్టులకు సెలవు కావడం వల్ల మరో 24 గంటల్లోగా న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నారు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది హిందూ భక్తులు అయోధ్య రామయ్యను ఎంతగానో విశ్వసిస్తూ భారీగా విరాళాలు సమర్పిస్తుంటారు. ఈ పవిత్రమైన ఆలయ నిధులను కొందరు అక్రమంగా దారిమళ్లించారనే వార్త వారి మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ట్రస్ట్‌లో అత్యున్నత, బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న చంపత్ రాయ్ వంటి వారు పదవుల నుంచి తప్పుకోవడం ఆలయ నిర్వహణ తీరుపై పలు ప్రశ్నలను లేవనెత్తుతోంది. ట్రస్ట్ పట్ల ప్రజల నమ్మకాన్ని నిలబెట్టడం ఇప్పుడు సవాలుగా మారింది.గతంలో