
ఉత్తర్ ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం (Ayodhya Ram Temple) లో జరిగిన విరాళాల దుర్వినియోగం కేసులో ముప్పేట విమర్శలు ఎదుర్కొంటున్న యోగీ ఆదిత్యనాథ్ సర్కార్ చర్యలు ప్రారంభించింది. వచ్చే ఏడాది ఎన్నికలకు సిద్ధమవుతున్న వేళ రామ మందిర విరాళాల దుర్వినియోగం వ్యవహారం తమ మెడకు చుట్టుకోవడంతో సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయిస్తోంది. సిట్ నివేదిక మేరకు 8 మందిపై నిధుల దుర్వినియోగం, మోసం, నేరపూరిత కుట్ర, నమ్మకద్రోహం వంటి ఆరోపణలపై కేసులు నమోదు చేసి అరెస్టు చేశారు. అయోధ్య రామాలయంలో విరాళాల గోల్ మాల్ ? యోగీ సర్కార్ సంచలన నిర్ణయం..!శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ ఫిర్యాదు మేరకు అయోధ్యలో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. రామశంకర్ యాదవ్ అలియాస్ తిన్ను, మనీష్ యాదవ్, లవ్‌కుశ్ మిశ్రా, కరుణేష్ పాండే, రామ శంకర్ మిశ్రా, సుభాష్ శ్రీవాస్తవ, అనుకల్ప్ మిశ్రా, అవినాష్ శుక్లాతో సహా 8 మంది వ్యక్తులు, అలాగే మరికొందరు అపరిచితులపైనా కేసు నమోదైంది. సిట్ ప్రాథమిక విచారణ, శ్రీ రామ జన్మభూమి ట్రస్ట్ సభ్యుడు కృష్ణ మోహన్ దాఖలు చేసిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు. భారతీయ న్యాయ సంహిత లోని సెక్షన్లు 306, 316(5), 317(4), 317(5), 61, 3(5)తో సహా పలు నిబంధనల కింద ఈ కేసు నమోదు చేశారు. వీటి ఆధారంగా 8 మందిని అరెస్టు చేశారు. ఈ కేసులో అరెస్టు అయిన వారిలో ఆలయ ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మాజీ డ్రైవర్ టిన్ను యాదవ్, విరాళాలు లెక్కించే రవి మిశ్రా, అతని కుమారుడు అనుకల్ప్ మిశ్రా, అతని అల్లుడు లవ్ కుశ్ మిశ్రా, ఆలయంలో పనిచేసే అవినాష్ శుక్లా, టిన్నూ యాదవ్ మేనల్లుడు మనీష్ యాదవ్, విరాళాలు లెక్కించే విభాగం ఛీఫ్ సుభాష్ శ్రీవాస్తవ, నగదు రసీదులు మార్చిన కరుణేష్ పాండే ఉన్నారు.