
పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్ స్టైల్ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Tgsrtc to runs special buses for school students: తెలంగాణలో మరల బడి గంటలు మోగనున్నాయి. ఇప్పటికే సమ్మర్ హలీడేస్ లను ఎండ తీవ్రత వేళ ప్రభుత్వం పొడిగించింది. ముందుగా ప్రకటించిన సమ్మర్ సెలవుల ప్రకారం జూన్ 12న స్కూళ్లు ప్రారంభం కావాల్సి ఉంది. కానీ రెండు తెలుగు రాష్ట్రాల్లో భానుడు ఇప్పటికి చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే ఒకవైపు నైరుతి రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చిన కూడా ఎండలు, మరోవైపు ఉక్కపోతతో జనాలు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తెలంగాణ ప్రభుత్వం సెలవుల్ని మరో రెండు రోజుల పాటు అంటే జూన్ 14 వరకు పొడిగించింది. ఇక జూన్ 15న సోమవారం రోజున స్కూళ్లకు విద్యార్థుల్ని పంపించాల్సి ఉంది. కానీ అదే రోజు సోమవతి అమావాస్య కూడా రావడంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపించడానికి ఇష్టపడటంలేదు. కొత్త అకాడమిక్ ఇయర్ ను అమావాస్య రోజున చెడుదినంగా భావిస్తు ఆ రోజున ప్రారంభిస్తే ఎలా అని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లల్ని స్కూళ్లకు పంపడానికి అంతగా ఆసక్తి కనబర్చడంలేదని సమాచారం. మరుసటి రోజు మంగళవారం కావడంతో ఇక స్కూళ్లకు తమ పిల్లల్ని బుధవారం రోజున అంటే జూన్ 17న చాలా మంది తమ పిల్లల్ని స్కూళ్లను పంపేందుకు ఇప్పటికే డిసైడ్ అయిపోయారని ప్రచారం జరుగుతుంది. దీనిపై అధికారులు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక రేపు సోమవారం స్కూళ్లు ప్రారంభంకు అన్ని ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు ప్రత్యేకంగా విద్యార్థుల్ని స్వాగతం పలికేందుకు ప్రత్యేకంగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. 2026-27