
అరుణ మహరాజు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. స్పోర్ట్స్, లైఫ్‌స్టైల్, హెల్త్, వినోదం, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. MATA Convention Held Grandly In The USA: ఉత్తర అమెరికా తెలుగు సమాజ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖిస్తూ మన అమెరికన్ తెలుగు అసోసియేషన్ (మాటా) ఆధ్వర్యంలో నిర్వహించిన 2వ మహాసభలు అత్యంత వైభవంగా ముగిశాయి. తెలుగు సంస్కృతి, సేవా కార్యక్రమాలు, సామాజిక ఐక్యతకు ప్రతీకగా నిలిచిన ఈ వేడుకలను.. పెన్సిల్వేనియాలోని గ్రేటర్ ఫిలడెల్ఫియా ఎక్స్‌పో సెంటర్, ఫెయిర్‌గ్రౌండ్స్‌లో రెండు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు. 7 వేల 500 మందికి పైగా తెలుగు కుటుంబాలు పాల్గొనడంతో ఉత్తర అమెరికాలోనే అతిపెద్ద తెలుగు సమ్మేళనంగా నిలిచింది. సినీ ప్రముఖులు ఈ వేడుకలను మరింతా సందడిగా మార్చారు. నిఖిల్ సిద్ధార్థ్, ఐశ్వర్య రాజేష్, దేవీశ్రీ ప్రసాద్, జయప్రద, సుమన్, అలీ, యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ మాచిరాజు, విషి అయ్యర్, శివారెడ్డి, అదిరే అభి, సునామి సుధాకర్, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ఫార్మార్మెన్స్‌తో ఆహూతులను అలరించారు. సింగర్ రామ్ మిర్యాల లైవ్ సంగీత ప్రదర్శన ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొలి రోజు హోస్ట్ గా యాంకర్ నిఖిల్ విజయేంద్ర సింహా, రెండవ రోజు యాంకర్ సుమ, యాంకర్ ప్రదీప్ హోస్ట్ గా వ్యవహరించి వేడుకలను మరింతా ఉత్తేజ పరిచారు. ఈ మహాసభలలో ప్రముఖ నటి జయప్రద మాటా లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును అందుకున్నారు. శ్రీనివాసరావు, భాస్కర్ గంటి, సాయినాథ్ కర్నాటి, స్వాతి అట్లూరి, దాము గేదల, విజయభాస్కర్, నాగేశ్వరరావు పూజారి, రాజు చామర్తి, కృష్ణ మద్దిపట్ల మాటా ఎక్సలెన్స్ అవార్డులను అందుకున్నారు. కార్యక్రమంలో మాటా అధ్యక్షుడు రమణ కిరణ్ దుద్దాగి, కన్వీనర్ శ్రీధర్ గూడల, సభ్యులు విజయభాస్కర్ కలాల్, ప్రవీణ్, కళ్యాణి