కోససీమ అంటే పచ్చటి కొబ్బరి చెట్లు, గోదారి పరవళ్లు మాత్రమే.. మర్యాదలు కూడా గుర్తుకు రావాల్సిందే. గోదారోళ్ల మర్యాదలు చూస్తే మతి పోవాల్సిందే. కొత్త అల్లుడికి 500 రకాలతో విందు భోజనం అంటూ తరుచూ రకరకాల వార్తలు వింటూనే ఉంటాం. అయితే ఇప్పుడు అంతకుమించి అనేలా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో చూపించిన దృశ్యాలు, చెప్పిన వివరాలు చూస్తే.. వామ్మో అనుకోవాల్సిందే. ఇంతకీ ఇదేంటంటే ఓ ఓణీల ఫంక్షన్. అయితే మీరనుకున్నట్లు సాదాసీదా ఓణీల ఫంక్షన్ కాదండీ బాబూ.. కళ్లు చెదిరే ఫంక్షన్.. నోరూరించే వేడుక.వీడియోలో చెప్పిన వివరాల ప్రకారం.. అమలాపురంలో ఈ ఓణీల ఫంక్షన్ జరిగింది. ఇక ఫంక్షన్‌కు వచ్చిన అతిథులకు కడుపులు ఉబ్బిపోయేలా.. ఐటమ్స్ వడ్డించారు. సుమారుగా 200 వెరైటీలతో అతిథులను అబ్బురపరిచారు. టిఫిన్ల నుంచి స్వీట్ల వరకు.. ఫ్రూట్స్ నుంచి డిజర్ట్స్ వరకూ.. ప్రతి ఒక్కటీ మెనూలో ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. చిట్టి బజ్జీ, చిట్టి గారె, తట్ట ఇడ్లీ మొదలుకుని నేతి పెసరట్టు, మసాలా దోసె ఇలా ఎన్నో రకాల టిఫిన్లు.. చిట్టి ముత్యాల బిర్యానీ మొదలుకుని ఎన్నో వెరైటీ సౌతిండియన్ వంటకాలను తిన్నవారికి తిన్నంత అనే రీతిలో అతిథులకు వడ్డించారు. ఈ భోజనాల కోసం ఒక్కో ప్లేట్‌కు రూ.6 వేల వరకూ వెచ్చించారంటే నోరెళ్ల బెట్టాల్సిందే. డ్యాన్సులు, పూల బొకేలు, ఖరీదైన శాండీలియర్స్, అప్పటికప్పుడు గాజుల తయారీ, మెహందీ, చిలక జోస్యం, 360 డిగ్రీల వీడియో.. మైసూరు ప్యాలెస్ తరహాలో సెట్టింగ్.. అబ్బో చెప్పుకుంటూపోతే చాంతాడంత లిస్ట్ అవుతుంది. ఆ రేంజులో ఈ ఓణీల ఫంక్షన్ నిర్వహించారు. ఇక ఇందుకోసం ఎంత ఖర్చు చేస్తారో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. ఈ ఓణీల ఫంక్షన్ కోసం ఏకంగా 6 కోట్ల రూపాయల వరకూ ఖర్చు చేసినట్లు సమాచారం. చిన్నారుల నుంచి పెద్దల వరకు వేడుకకు వచ్చిన ప్రతి ఒక్కరూ ఆడిపాడేలా ప్రత్యేకమైన ఏర్పా్ట్లు
Actor ProfilePolitician
అమలాపురం ఓణీ ఫంక్షన్.. భోజనం ప్లేట్ రూ. 6 వేలు.. 200 వెరైటీలు.. రూ. కోట్లలో ఖర్చు
Total News1
Movie Updates0
Sources1
Samayam Telugu•15 Jun 2026
అమలాపురం ఓణీ ఫంక్షన్.. భోజనం ప్లేట్ రూ. 6 వేలు.. 200 వెరైటీలు.. రూ. కోట్లలో ఖర్చు