
ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర రాజధాని అమరావతి ప్రాంతానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది. కేవలం ఆధునిక కాలంలోనే కాకుండా, శతాబ్దాల క్రితమే ఈ ప్రాంతం ప్రముఖ రాజధానిగా, సాంస్కృతిక కేంద్రంగా వర్ధిల్లింది. ఈ నేపథ్యంలో 12వ శతాబ్దంలో అమరావతి రాజధాని చరిత్ర, నాటి భౌగోళిక పరిస్థితులు, ప్రాచీన శాసనాల వెనుక దాగున్న అద్భుతమైన నిజాలను ప్రముఖ చరిత్ర పరిశోధకుడు శివశంకర్ గారు తెలుగువన్ కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో వివరించారు. చరిత్ర అనేది కేవలం డిగ్రీలు, పిహెచ్‌డిలు చేసిన మేధావుల గ్రంథాల్లోనే కాదు, లోకాన్ని చదివిన సామాన్యుల అన్వేషణలోనూ దాగి ఉంటుందని నిరూపిస్తున్నారు శివశంకర్ . పట్టుమని పదో తరగతి కూడా చదవకపోయినా, మన భౌగోళిక పరిస్థితులు, చారిత్రక శాసనాలు, ప్రాచీన ఆధారాలపై ఆయన సాధించిన పట్టు అసాధారణమైనది. ఆయన రాసిన "గుంటూరు జిల్లా అదృశ్య గ్రామాలు" అనే పరిశోధనా గ్రంథం చరిత్రకారులనే ఆశ్చర్యపరుస్తోంది. ఒక సాదాసీదా వ్యక్తి దశాబ్దాల పాటు తన సొంత సమయాన్ని, డబ్బును పణంగా పెట్టి, మరుగున పడిపోయిన గుంటూరు, అమరావతి ప్రాంతాల 12వ శతాబ్దపు రాజధాని వైభవాన్ని శాసనాల ఆధారంగా వెలికితీయడం ఒక అద్భుతమైన చారిత్రక యాత్ర. గుంటూరు జిల్లా పరిసర ప్రాంతాల్లోని అదృశ్య గ్రామాలు, ప్రాచీన శాసనాలపై ఆయన దశాబ్దాలుగా సాగించిన పరిశోధనలు నేటి విద్యావంతులను సైతం విస్మయపరుస్తున్నాయి. పిహెచ్‌డిలు, డాక్టరేట్లు చేసిన వారు కూడా తాకని ఎన్నో అరుదైన చారిత్రక అంశాలను ఆయన సేకరించారు. నాటి కాలంలో గుంటూరు, విజయవాడ, అమరావతి పరివాహక ప్రాంతాల భౌగోళిక విస్తరణ ఏ విధంగా ఉండేదో శివశంకర్ ఆధారాలతో సహా వివరించారు. ముఖ్యంగా గుంటూరు జిల్లాలోని వివిధ చారిత్రక ప్రస్థానాలు, శాసనాల ప్రాధాన్యతను ఆయన గుర్తు చేశారు. ఎంతో మంది రాజకీయ ప్రముఖులు, సెలబ్రిటీలతో పోల్చితే.. ఇలాంటి ఒక అసాధరణ మేధస్సు కలిగిన వ్యక్తిశివశంకర్. 12వ శతాబ్దంలోనే కాకుండా, శతాబ్దాల కాలంగా ఈ ప్రాంతం ఎలా పరిణామం చెందిందనే విషయాలను ఆయన