అమరావతి పనులు శ ర వేగంగా జరుగుతున్నాయి
Actor ProfilePolitician

అమరావతి పనులు శ ర వేగంగా జరుగుతున్నాయి

Total News1
Movie Updates0
Sources1
అమరావతి పనులు శ ర వేగంగా జరుగుతున్నాయి
Vaartha14 Jun 2026
అమరావతి పనులు శ ర వేగంగా జరుగుతున్నాయి

Nara Lokesh: ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు ఎక్కడా ఆగకుండా, అత్యంత వేగంగా ముందుకు సాగుతున్నాయని రాష్ట్ర ఐటీ, ఐక్యూ శాఖల మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో అభివృద్ధి పనులు నిలిచిపోయాయని, చిన్నపాటి వర్షాలకే అమరావతి మునిగిపోతోందంటూ కొంతమంది సాగరిస్తున్న తప్పుడు ప్రచారాలను ఆయన తీవ్రంగా కొట్టిపారేశారు. ఈ మేరకు క్షేత్రస్థాయిలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులను, పనుల పురోగతిని కళ్లకు కట్టేలా ఆయన తన అధికారిక ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఒక ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. Read also: Srisailam Cottages Issue: శ్రీశైలంలో కాటేజీల వివాదం.. వైసీపీ ఎమ్మెల్యేకు ఆలయ అధికారుల నోటీసులు రాజధాని నిర్మాణాలపై వస్తున్న రూమర్లకు చెక్ పెడుతూ మంత్రి లోకేశ్ ట్విట్టర్‌లో స్పందించారు. “అమరావతి మహానగరంలో పనులు ఏమాత్రం కుంటుపడలేదు. వర్షాలు పడగానే రాజధాని ప్రాంతం ముంపునకు గురైందంటూ కొందరు కావాలనే బురదజల్లుతున్నారు. కానీ అక్కడ వాస్తవ పరిస్థితి వేరుగా ఉంది. అమరావతిలో ఐకానిక్ టవర్లు, శాసనసభ (అసెంబ్లీ), హైకోర్టు భవనాలతో పాటు ప్రధాన అంతర్గత రహదారులు, నీటి నిల్వ రిజర్వాయర్ల పనులు నిరంతరాయంగా జరుగుతున్నాయి” అని లోకేశ్ వివరించారు. వీటితో పాటే ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కొరకు నిర్మిస్తున్న నివాస సముదాయాలు, మంత్రుల అధికారిక బంగ్లాల నిర్మాణాలు కూడా అంతే చురుగ్గా సాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. రాజధాని అమరావతిపై రాజకీయ లబ్ధి కోసం కొందరు చేస్తున్న నెగెటివ్ ప్రచారాలకు ఇకనైనా స్వస్తి పలకాలని మంత్రి లోకేశ్ హితవు పలికారు. గ్రౌండ్ లెవెల్‌లో కార్మికులు, భారీ యంత్రాలతో రాత్రింబవళ్లు జరుగుతున్న పనుల దృశ్యాలను వీడియో రూపంలో నేరుగా ప్రజల ముందు ఉంచడం ద్వారా, అమరావతి భవిష్యత్తుపై అపనమ్మకం సృష్టించే వారికి కూటమి ప్రభుత్వం తరఫున ఆయన గట్టి సమాధానం ఇచ్చారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. Gurbhej Singh: లండన్ లో భారత సంతతి యువకుడు

అమర వత పన ల శ ర వ గ గ జర గ త న న య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in