అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి
Actor ProfilePolitician

అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి

Total News1
Movie Updates0
Sources1
అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి
AP7AM14 Jun 2026
అమరావతి పనులు ఆగలేదు.. జోరుగా సాగుతున్నాయి

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా, ఎక్కడా విరామం లేకుండా కొనసాగుతున్నాయని రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ స్పష్టం చేశారు. రాజధాని పనులు ఆగిపోయాయని, చిన్న వర్షానికే మునిగిపోతోందని కొందరు చేస్తున్న విష ప్రచారాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు నిర్మాణ పనుల పురోగతిని చూపిస్తూ ఆయన తన 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు."అమరావతిలో పనులు ఏమాత్రం ఆగడం లేదు. వర్షం కురిస్తే మునిగిపోయిందంటూ కొందరు ప్రచారం చేస్తున్నారు. కానీ, నిర్మాణాలు జోరుగా కొనసాగుతున్నాయి. రాజధానిలో ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హైకోర్టు, ప్రధాన రహదారులు, రిజర్వాయర్ల పనులు వేగంగా జరుగుతున్నాయి. వీటితో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కోసం నిర్మిస్తున్న టవర్లు, మంత్రుల బంగ్లాల నిర్మాణాలు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇకనైనా విష ప్రచారాన్ని ఆపండి" అని చెప్పిన ఓ వీడియోను మంత్రి లోకేశ్ 'ఎక్స్' ద్వారా పంచుకున్నారు. క్షేత్రస్థాయిలో జరుగుతున్న పనులను వీడియో రూపంలో ప్రజల ముందు ఉంచి, అమరావతిపై జరుగుతున్న దుష్ప్రచారానికి మంత్రి లోకేశ్ గట్టిగా బదులిచ్చారు

అమర వత పన ల ఆగల ద జ ర గ స గ త న న య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in