అప్పుడు సుశాంత్ ... ఇప్పుడు సంచిత
Actor ProfileActor

అప్పుడు సుశాంత్ ... ఇప్పుడు సంచిత

Total News1
Movie Updates0
Sources1
అప్పుడు సుశాంత్ ... ఇప్పుడు సంచిత
Chitrajyothy16 Jun 2026
అప్పుడు సుశాంత్ ... ఇప్పుడు సంచిత

బుల్లితెర, సినీ నటి సంచిత ఉగాలే ఆత్మహత్యపై ప్రతిఒక్కరూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య చేసుకున్న జూన్‌ 14నే సంచిత సైతం సూసైడ్ చేసుకోవడాన్ని ఆమె సోదరుడు ఆకాశ్‌ ప్రస్తావించడం విశేషం. కొన్ని సంఘటనలను కేవలం కాకతాళీయం అని తోసిపారేయలేం. ఏదో తెలియని సంబంధం ఉందేమో అనే అనుమానం వస్తూ ఉంటుంది. ఆదివారం ముంబైలో ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వర్థమాన నటి సంచిత ఉగాలే (Sanchita Ugale) సంఘటన బాలీవుడ్‌ను ఓ కుదుపు కుదిపేసింది. ఎక్కువ సినిమాల్లో సంచిత ఉగాలే నటించకపోయినా... తనదైన ముద్రను ఆమె బుల్లితెరపై వేసింది. పాపులర్ టీవీ సీరియల్స్ లో ప్రధాన పాత్రలను పోషించి, మెప్పించింది. మంచి భవిష్యత్తు ఉన్న సమయంలో ఆమె ఇలా అర్థాంతరంగా తనువు చాలించడం చాలామందిని కలచివేసింది. ఇదే సమయంలో ఆమె సోదరుడు ఆకాశ్‌ (Aakash) చేసిన వ్యాఖ్యలు సైతం చాలామందిని ఆలోచింప చేస్తున్నాయి. సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం ఇదే తేదీన అంటే 2020 జూన్ 14న ప్రముఖ బాలీవుడ్ కథానాయకుడు సుశాంత్‌ సింగ్‌ రాజపుత్‌ (Sushant Singh Rajput) ఆత్మహత్య చేసుకున్నాడు. సినిమా రంగం నుంచి వచ్చిన తీవ్రమైన ఒత్తిడిని తట్టుకోలేక అతను అలాంటి ప్రయత్నం చేశాడు. సరిగ్గా నా సోదరి విషయంలోనూ అదే జరిగిందనిపిస్తోంది. ఎందుకంటే ఆమె ఆత్మహత్య చేసుకోవడానికి ఒకరోజు ముందు ఇన్ స్టాగ్రామ్‌లో ఓ రీల్ పోస్ట్ చేస్తూ, 'ఇట్స్ అగైన్ 14 జూన్' అని మెన్షన్ చేసింది. ఆ మర్నాడే ఆమె సుశాంత్‌ తరహాలోనే తనూ ఆత్మహత్య చేసుకుంది. కాబట్టి గతంలో జూన్ 14న ఏం జరిగిందో అదే ఈసారి జరుగబోతోందని ఆమె హింట్‌ ఇచ్చినట్టుగా అనిపిస్తోంది' అని తెలిపాడు. జూన్‌ 14 అనేది బాలీవుడ్‌ వర్గాలకు ఓ దుర్దినంగా మారిపోయింది అనుకోవచ్చు! సంచిత ఉగాలే కెరీర్‌ సాఫీగా సాగుతున్న ఈ సమయంలో ఆమె ఆత్మహత్య చేసుకోవడం చాలామందిని

అప ప డ స శ త ఇప ప డ స చ త Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in