
జబర్దస్త్ రాము తన కామెడీతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. కానీ ఆతర్వాత జబర్దస్త్ నుంచి తప్పుకున్నాడు రాము. అలాగే పలు సినిమాల్లోనూ నటించి మెప్పించారు రాము. గతకొంతలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నాడు రాము. కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్ ప్రయాణం, సహనటుడు సుడిగాలి సుధీర్‌తో తన అనుబంధం, జబర్దస్త్ నుంచి బయటకు రావడం, అలాగే సినిమా అవకాశాల కోసం చేస్తున్న ప్రయత్నాల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. రాము తన కెరీర్ బిగినింగ్ గురించి మాట్లాడుతూ.. ఇంటర్ పూర్తయిన తర్వాత రామోజీ ఫిలిం సిటీలో హోటల్ ఇండస్ట్రీలో వెయిటర్‌గా చేరి, అసిస్టెంట్ మేనేజర్ స్థాయికి ఎదిగి రాజీనామా చేశానని తెలిపారు. ఆ సమయంలో తన జీతం కేవలం 850 రూపాయలు మాత్రమేనని, ప్రమోషన్లు ఇస్తున్నా వద్దని చెప్పి తన స్థానాన్ని ఇంకొకరికి ఇచ్చానని చెప్పారు. అదే సమయంలో సుడిగాలి సుధీర్ కూడా రామోజీ ఫిలిం సిటీలో క్లోజప్ మెజీషియన్‌గా పనిచేసేవాడని, అప్పటి నుంచీ తామిద్దరం మంచి స్నేహితులమని గుర్తు చేసుకున్నారు. సుధీర్ ప్రస్తుత స్టార్‌డమ్ గురించి రాము చాలా గర్వంగా మాట్లాడారు. సుధీర్ ఒక పెద్ద స్టార్, హీరో, డిజిటల్, సోషల్ మీడియాలో భయంకరమైన ఫ్యాన్ బేస్ ఉన్నప్పటికీ, అతడు మొదటి నుంచీ డౌన్ టు ఎర్త్ వ్యక్తి అని రాము పేర్కొన్నారు. సుధీర్, వేణు, టింకూతో కలిసి తాను మొదటి స్కిట్ ప్రాక్టీస్ చేసిన విషయాన్ని గుర్తుచేసుకున్నారు. సుధీర్ పదిమందికి ఆదర్శంగా ఎదుగుతున్నప్పుడు తమకు కూడా సంతోషంగా ఉంటుందని రాము అన్నారు. సుధీర్ ఫోన్ కాల్స్ లిఫ్ట్ చేయడం లేదనే ఫిర్యాదుపై రాము తనదైన అభిప్రాయాన్ని వెల్లడించారు. "మన పనిలో మనం బిజీగా ఉన్నాం. నా ఫోన్ ఎత్తలేదు అని కంప్లైంట్ చేయడం కన్నా నిన్ను నిన్నుగా గుర్తించే వ్యక్తులతో మీరు జర్నీ చేయండి ప్లీజ్" అని సలహా ఇచ్చారు. సుధీర్ ఫోన్ చేస్తే ఎత్తకపోవడని చాలా కారణాలు ఉండొచ్చు