అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది
Actor ProfileActor

అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది
TV9 Telugu6 Jul 2026
అప్పుడు నన్ను బండబూతులు తిట్టారు.. తప్పని పరిస్థితుల్లో ఆ సినిమా చేయాల్సి వచ్చింది

టాలీవుడ్ దర్శకురాలు నందిని రెడ్డి హిట్స్ తో దూసుకుపోతున్నారు. తాజాగా సమంత హీరోయిన్ గా మా ఇంటి బంగారం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్నారు. కంటెంట్ ఉన్న సినిమాలు తెరకెక్కిస్తూ మంచి విజయాలను అందుకుంటున్నారు నందిని రెడ్డి. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నందిని రెడ్డి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సినిమాల్లో హీరోయిన్స్ పాత్రలను క్రియేట్ చేయడం, నటీనటుల స్వేచ్ఛ వంటి అంశాలపై చర్చ జరుగుతుండగా, ఆమె తన సొంత అనుభవాన్ని పంచుకున్నారు. ఒక కథానాయికకు పాత్రను తిరస్కరించే స్వేచ్ఛ ఉన్నప్పటికీ, దానికి ఒక మూల్యం ఉంటుందని నందిని రెడ్డి అభిప్రాయపడ్డారు. పెద్ద దర్శకుడి సినిమాను వదులుకుంటే మరో అవకాశం కోల్పోయే ప్రమాదం ఉంటుందని, అలాంటి ధైర్యం చేసేవారు తెలుగు చిత్ర పరిశ్రమలో చాలా తక్కువ మంది ఉన్నారని ఆమె అన్నారు. సినిమా విడుదలైన తర్వాత ఒక పాత్రపై విమర్శలు వచ్చినప్పుడు, ఆ పాత్ర చేసిన వారిని మాత్రమే లక్ష్యంగా చేసుకోవడం సరైనది కాదని, ఒక సినిమా ప్రజల్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా ఏదైనా మాట్లాడవచ్చని ఆమె పేర్కొన్నారు. ఇది కూడా చదవండి : DSP: ఆ పాటను అరగంటలో రాసి, కంపోజ్ చేశా.. కట్ చేస్తే సెన్సేషనల్ హిట్ అయ్యింది : దేవి శ్రీ ప్రసాద్ అలాగే నందిని రెడ్డి తన దర్శకత్వంలో వచ్చిన జబర్దస్త్ సినిమా ప్లాప్ అయినప్పుడు తాను ఎదుర్కొన్న తీవ్రమైన విమర్శలను, బండబూతులను గుర్తు చేసుకున్నారు. “జబర్దస్త్ చేసినప్పుడు బండబూతులు తిట్టారు. నేను అవునండి, తప్పు నాదే. నేను ఓ చెత్త సినిమా చేశా.. మీ అందరినీ డిసప్పాయింట్ చేశాను” అని ఆ విమర్శలను స్వీకరించినట్లు చెప్పారు. ప్రజల నుంచి ప్రశంసలు అందుకున్నప్పుడు ఎంత సంతోషిస్తామో, విమర్శలు వచ్చినప్పుడు కూడా అంతే సహనంతో స్వీకరించాలని ఆమె అన్నారు. తాను అలా మొదలైంది వంటి బ్లాక్‌బస్టర్ సినిమా తీసినా, జబర్దస్త్ పరాజయం తనను పూర్తిగా కిందకు పడేసిందని చెప్పారు. ఇది

అప ప డ నన న బ డబ త ల త ట ట ర తప పన పర స థ త ల ల ఆ స న మ చ య ల స వచ చ ద Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in