
Government Hospitals :మన రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ ఆసుపత్రుల అభి వృద్ధి పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు కనబరుస్తూ అక్కడి పరిసరాల పరిశుభ్రతను, మౌలిక వసతులను మెరుగుపరి చేందుకు తగిన బడ్జెట్ ఏర్పాటు చేసి ఎన్నో చర్యలు తీసు కుంటున్నప్పటికి ప్రభుత్వ అసుపత్రిలోని కొంతమంది సిబ్బంది నిర్లక్ష్య వైఖరి మూలాన అక్కడి రోగుల వార్డులు ఎలుకలకు, దోమలకు, పాములకు, విషసర్పాలకు నిలయా లుగా మారుతూ అక్కడికి వైద్య నిమిత్తమై వస్తున్న రోగు లకు ప్రభుత్వ ఆసుపత్రుల్లోని వార్డులు ఒక నరకకూపంగా మారుతుండటం కడు శోచనీయం. ప్రయివేటు వైద్యశాలల్లో చికిత్స శక్తికి మించిన పని కావడంతో బీద, బిక్కి, నిరుపేదలు తప్పనిసరి పరిస్థితుల్లో వైద్యం చేయించుకునే నిమిత్తమై ప్రభుత్వ ఆసుపత్రులకు నిత్యం ఎంతో దూర ప్రాంతాల నుంచి వందలాది మంది వస్తూ వుంటారు. మరీ వారికి లక్షలాది రూపాయలు జీతాలు తీసుకుంటున్న డాక్టర్లు, వేలాది రూపాయల జీతాలు తీసుకుంటున్న దిగువ స్థాయి ఆరోగ్య సిబ్బంది వంటివారు తమ వృత్తికి తగిన న్యాయం చేస్తూ రోగుల వార్డులు పరిశుభ్రంగా ఉండేలా తగు జగ్ర త్తలు తీసుకునే గురుతర బాధ్యత ముమ్మాటికీ వారి భుజస్కందాలపై వుంది. ఇందులో భాగంగా అక్కడి బాత్రూంలలో గాని, వార్డులలో గాని ఎక్కడైనా పెద్ద పెద్ద రంధ్రాలు వుంటే తక్షణమే వాటిని పూడ్చివేయడంతోపాటు అక్కడి బండ సట్టం మరీ పాతపడిపోయి చీలికలు వచ్చి వుంటే తక్షణమే వాటి మరమ్మత్తులపై దృష్టి పెట్టాలి. అప్పుడే అక్కడి వార్డులలో పాములు, ఎలుకలు, దోమలు వంటివి చొరబడకుండా రోగులు తగిన రక్షణలో ఉండగలు గుతారు. Read Also : Bengaluru Crime: ప్రియురాలి గొంతుకోసి చంపేసిన ప్రియుడు.. పెళ్లి వివాదమే కారణమా? ఎందుకంటే అక్కడికి వచ్చే రోగులు ఎంతో అపాయకరమైన పరిస్థితుల్లో, ఆందోళనతో ప్రభుత్వ ఆసుపత్రు లకు వస్తూ వుంటారు. అలాంటి రోగులు వారి తరపున సహాయకారిగా ఉండేందుకు వచ్చే వారి కుటుంబసభ్యులకు తగిన సౌకర్యాలు కనీసం ఒక మోస్తారులోనైనా