
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నటి త్రిష గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ మీడియాతో పాటు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. విజయ్ తన భార్య సంగీతతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవడం కాస్త విమర్శలుకు దారితీసింది. విజయ్ ఎన్నికల్లో పోటీ చేయడం ముఖ్యమంత్రి అవడం చకచక జరిగిపోయాయి. దాంతో ఇక వీరిద్దరూ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నారనే ఊహాగానాలు కూడా గట్టిగా వినిపించాయి. అయితే తాజాగా చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు వీరిద్దరి బంధానికి బ్రేక్ పడిందా అనే అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. నిన్న జూన్ 22న విజయ్ పుట్టినరోజు సందర్భంగా సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అభిమానులు విజయ్ కు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. కానీ ఎప్పుడూ విజయ్ బర్త్ డేకి ప్రత్యేకంగా విష్ చేసే త్రిష.. ఈసారి కనీసం సోషల్ మీడియాలో ఒక్క పోస్ట్ కూడా పెట్టకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో వీరిద్దరి మధ్య ఏదో జరిగిందనే అనుమానాలు మొదలయ్యాయి. ఈ అనుమానాలకు బలం చేకూరుస్తూ త్రిష తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో విజయ్‌ను అన్‌ఫాలో చేయడం సోషల్ మీడియాలో సంచలనంగా మారింది. ఎంతో కాలంగా కొనసాగుతున్న వీరి స్నేహం లేదా రిలేషన్‌షిప్‌కు త్రిష ఈ విధంగా ఫుల్‌స్టాప్ పెట్టడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత త్రిషను దూరం పెట్టారని, ఏంటి విజయ్ ఇలా చేసావని కొందరు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ అన్‌ఫాలో వ్యవహారం కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు విజయ్ – సంగీత మళ్ళి కలవబోతున్నారంటూ కూడా టాక్స్ వినిపిస్తున్నాయి