అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
Actor ProfilePolitician

అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

Total News3
Movie Updates0
Sources2
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా
TeluguOne17 Jun 2026
అన్నాడీఎంకేకు మరో ఎమ్మెల్యే రాజీనామా

తమిళనాట అన్నాడీఎంకే పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుగా తయారౌతోంది. తాజాగా ఆ పార్టీ సీనియర్ నాయకుడు, తమిళనాడు మాజీ ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ సి. విజయభాస్కర్ తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను ఆయన శాసనసభ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను స్వయంగా కలిసి అందజేశారు. ఆ రాజీనామాను స్పీకర్ వెంటనే ఆమోదించారు. విరాలిమలై నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న విజయభాస్కర్ రాజీనామాతో దీంతో అన్నాడీఎంకే లో తీవ్ర కలకలం మొదలైంది. ఈ రాజీనామా వెనుక బలమైన రాజకీయ కారణాలు ఉన్నట్లు చెబుతున్నారు. గత కొంతకాలంగా పార్టీ అగ్ర నాయకత్వం, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి వైఖరి పట్ల విజయభాస్కర్ తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీలోని నిజమైన, క్షేత్రస్థాయి కార్యకర్తల గళాన్ని, అభిప్రాయాలను అధిష్టానం కనీసం వినడం లేదంటూ ఆయన బహిరంగంగానే ఆరోపించారు. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం ప్రభుత్వంపై జరిగిన అసెంబ్లీ విశ్వాస పరీక్షలో విజయభాస్కర్ పార్టీ లైన్‌ను ధిక్కరించి, ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం గమనార్హం. నాటి నుంచే ఆయన పార్టీ మారతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. తన నియోజకవర్గ ప్రజల ఆకాంక్షలు, భవిష్యత్ ప్రయోజనాలకు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నానని, త్వరలోనే తన తదుపరి కార్యాచరణను ప్రకటిస్తానని విజయభాస్కర్ తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం.. కేవలం కొద్ది నెలల వ్యవధిలోనే అన్నాడీఎంకే పార్టీని వీడి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన ఐదో శాసనసభ్యుడిగా విజయభాస్కర్ నిలిచారు. ఈ వరుస వలసల కారణంగా 234 మంది మొత్తం సభ్యులున్న తమిళనాడు శాసనసభలో అన్నాడీఎంకే పా బలం ఇప్పుడు 42కు పడిపోయింది. మరోవైపు, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ తన ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేయడంతో ఖాళీ అయిన సీటుతో కలుపుకుని, ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీలో మొత్తం ఖాళీల సంఖ్య 6 కి చేరుకుంది. ప్రస్తుత

పార్టీ వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చు.. ఎంపీల ఫిరాయింపు ఊహాగానాలపై ఉద్ధవ్ ఠాక్రే
Andhra Jyothy16 Jun 2026
పార్టీ వీడాలనుకుంటే వెళ్లిపోవచ్చు.. ఎంపీల ఫిరాయింపు ఊహాగానాలపై ఉద్ధవ్ ఠాక్రే

పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన వస్తున్న ఉహాగానాలపై శివసేన యూబీటీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే మౌనం వీడారు. పార్టీని వీడాలని కోరుకునే వారు వెళ్లిపోవచ్చని చెప్పారు. ముంబై: పార్టీ ఎంపీల విధేయతకు సంబంధించిన

పుట్టిన ప్రతి చిన్నారిపై రూ.1.28 లక్షల అప్పు భారం.. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై విజయ్ శ్వేతపత్రం
Andhra Jyothy16 Jun 2026
పుట్టిన ప్రతి చిన్నారిపై రూ.1.28 లక్షల అప్పు భారం.. తమిళనాడు ఆర్థిక పరిస్థితిపై విజయ్ శ్వేతపత్రం

తమిళనాడు ముఖ్యమంత్రి సి.జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై సమగ్ర శ్వేతపత్రాన్ని మంగళవారంనాడు విడుదల చేసింది. డీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్రం తీవ్ర ఆర్థిక

అన న డ ఎ క క మర ఎమ మ ల య ర జ న మ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in