అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు
Actor ProfileActor

అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే
Asianet News Telugu12 Jul 2026
అన్న కొడుకు కోసం రంగంలోకి మహేష్ బాబు, జయకృష్ణ కోసం ఏం చేయబోతున్నాడంటే

ఘట్టమనేని కుటుంబం నుంచి మరో హీరో టాలీవుడ్‌లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణ మనవడు, మహేష్ బాబు సోదరుడు రమేష్ బాబు కుమారుడు ఘట్టమనేని జయకృష్ణ హీరోగా పరిచయం అవుతున్నాడు. ఆయన హీరోగా నటిస్తున్న తొలి చిత్రం శ్రీనివాస మంగాపురం ప్రస్తుతం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమాతో బాలీవుడ్ యంగ్ స్టార్ రాషా తడాని హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. అశ్వినీ దత్ సమర్పణలో, చందమామ కథలు బ్యానర్‌పై జెమినీ కిరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు RX100 చిత్రంతో గుర్తింపు పొందిన అజయ్ భూపతి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ కు ఆడియన్స్ నుంచి మంచి స్పందన వచ్చింది. జయకృష్ణ ఫస్ట్ పిక్చర్ కావడంతో పాటు కృష్ణ మూడో తరం వారసుడిగా ఆయన ఎంట్రీ ఇవ్వడం కూడా ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను పెంచుతోంది. ఈ సినిమా జులై 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈక్రమంలో ఈమూవీ కోసం సూపర్ స్టార్ మహేష్ బాబు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. తన అన్న కొడుకుని ఇండస్ట్రీలో సెట్ చేయడం కోసం ఆయన కొన్ని బాధ్యతలు తీసుకున్నట్టు సమాచారం. శ్రీనివాస మంగాపురం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు సూపర్ స్టార్ మహేష్ బాబు ముఖ్య అతిథిగా హాజరుకానున్నారని సమాచారం. అధికారిక ప్రకటన ఇంకా వెలువడకపోయినా, ఈ వార్త ఘట్టమనేని అభిమానుల్లో ఉత్సాహాన్ని పెంచుతోంది. సమాచారం ప్రకారం, శ్రీనివాస మంగాపురం ప్రీ రిలీజ్ ఈవెంట్ జులై 2న సాయంత్రం 6 గంటల నుంచి హైదరాబాద్‌లోని శిల్పకళాలో నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి మహేష్ బాబు హాజరై తన అన్న రమేష్ బాబు కుమారుడు జయకృష్ణను అభిమానులకు అధికారికంగా పరిచయం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. మహేష్ బాబు ఈ ఈవెంట్ కు వస్తే.. సూపర్ స్టార్ అభిమానులంతా అక్కడికి వస్తారు. జయకృష్ణ సినిమాకు పబ్లిసిటీతో పాటు.. అతని

అన న క డ క క స ర గ ల క మహ ష బ బ Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in