అన్నయ్యా జీవించేశారు.. బీటీఎస్ వీడియో వైరల్
Actor ProfileActor

అన్నయ్యా జీవించేశారు.. బీటీఎస్ వీడియో వైరల్

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అన్నయ్యా జీవించేశారు.. బీటీఎస్ వీడియో వైరల్
Chitrajyothy3 Jul 2026
అన్నయ్యా జీవించేశారు.. బీటీఎస్ వీడియో వైరల్

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కొల్లి కాంబినేషన్‌‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మెగా158’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ మూవీ పొల్లాచ్చి షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా బీటీఎస్ వీడియోను మేకర్స్ వదిలారు. మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), దర్శకుడు బాబీ కొల్లి (Bobby Kolli) కాంబినేషన్‌‌లో రూపుదిద్దుకుంటోన్న ‘మెగా158’ (Mega 158) చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ వంటి భారీ బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ విజయవంతమైన కాంబోలో మూవీ రాబోతుండటంతో.. అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాత వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్‌ శరవేగంగా సాగుతోంది. ఇప్పటికే పొల్లాచ్చిలో మొదటి షెడ్యూల్‌ను పూర్తి చేసుకున్న చిత్ర బృందం, సోమవారం హైదరాబాద్‌లో ఒక కొత్త షెడ్యూల్‌ను ప్రారంభించింది. పొల్లాచ్చి షెడ్యూల్‌లో హై-వోల్టేజ్ యాక్షన్, ప్రధాన తారాగణం పాల్గొన్న కీలక సన్నివేశాలను చిత్రీకరించినట్లుగా తెలుపుతూ.. ఈ షెడ్యూల్‌కు సంబంధించిన ‘బిహైండ్-ది-సీన్స్’ (BTS) వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ వీడియోలో సెట్స్‌లో ఉన్న ఉత్సాహభరితమైన వాతావరణం, ప్రతి సన్నివేశం వెనుక ఉన్న ప్లానింగ్, సినిమాను ఎంత భారీ స్థాయిలో రూపొందిస్తున్నారో చూడవచ్చు. ఇందులో చిరంజీవి లుక్‌ని రివీల్ కాకుండా జాగ్రత్తలు తీసుకున్న మేకర్స్.. అనస్వర రాజన్ పాత్రని మాత్రం పరిచయం చేశారు. ప్రస్తుతం ఈ వీడియోలో బాగా వైరల్ అవుతోంది. ఈ BTS వీడియోలో హైలెట్‌గా నిలిచిన అంశం ఏమిటంటే.. దర్శకుడు బాబీ కొల్లికి సంబంధించిన ఒక మూమెంట్. ఒక సన్నివేశంలో చిరంజీవి పూర్తిగా లీనమై నటించడాన్ని చూసి దర్శకుడు భావోద్వేగానికి లోనయినట్లుగా తెలుస్తోంది. మెగాస్టార్ అద్భుతమైన నటనను చూసి ముగ్ధుడైన బాబీ.. ‘అన్నయ్యా.. జీవించేశారు’ అని ఉద్వేగంతో తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. దర్శకుడు బాబీ కొల్లి ఇందులో చిరంజీవిని ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. తాజాగా

అన నయ య జ వ చ శ ర బ ట ఎస వ డ య వ రల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in