
నాగబంధం రెండేళ్ల పాటు శ్రమించి అద్భుతంగా తీసిన సినిమా. అభిషేక్ గారు తన డ్రీమ్ ప్రాజెక్ట్‌లో నన్ను భాగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది: హీరో విరాట్ కర్ణ విరాట్ కర్ణ హీరోగా అభిషేక్ నామా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ ‘నాగబంధం – ది సీక్రెట్ ట్రెజర్’. నిక్ స్టూడియోస్ బ్యానర్‌పై కిషోర్ అన్నపురెడ్డి, నిశిత నాగిరెడ్డి ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఈ చిత్రంలో నభా నటేష్, ఐశ్వర్య మీనన్, జగపతిబాబు, మహేష్ మంజ్రేకర్, రిషభ్ సావ్నీ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. జూలై 3న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ సినిమా కథలోని ట్రెజర్ హంట్ కాన్సెప్ట్‌కు అనుగుణంగా ఈ ప్రచార యాత్రను రూపొందించారు. ఈ రోజు ఆనంత పద్మనాభ స్వామి వారి రథ యాత్రని ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. స్వామి వారి రథయాత్ర ఈవెంట్‌లో డైరెక్టర్ అభిషేక్ నామా మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఇంత వర్షంలో కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ థాంక్స్. ఇది కేవలం సినిమా ప్రమోషన్స్ మాత్రమే కాదు, మన సంస్కృతి, మన మూలాలను నెక్స్ట్ జనరేషన్‌కు పరిచయం చేయడానికి చేస్తున్న ఒక ప్రయత్నం. ఇది మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇందుకు మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంత పెద్ద విజన్‌ను సపోర్ట్ చేసిన నిషిత గారికి, కిషోర్ గారికి ధన్యవాదాలు. విరాట్‌ను చాలా కష్టపెట్టాను. తీవ్ర జ్వరంలో కూడా అతను ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పనిచేశాడు. ఈ సినిమా తర్వాత విరాట్ అంటే ఏంటో అందరికీ తెలుస్తుంది. మా టీమ్ అందరికీ థాంక్యూ. జునైద్, అభి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. వారి మ్యూజిక్ మీ అందరికీ నచ్చుతుంది. ఈ రథయాత్రను