అద్భుతమా!! గోల్డెన్ అవర్స్ ఎక్కడ పోయాయి
Actor ProfilePolitician

అద్భుతమా!! గోల్డెన్ అవర్స్ ఎక్కడ పోయాయి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అద్భుతమా!! గోల్డెన్ అవర్స్ ఎక్కడ పోయాయి
Sakshi7 Sept 2026
అద్భుతమా!! గోల్డెన్ అవర్స్ ఎక్కడ పోయాయి

వెనెజువెలాను వణికించిన జంట భూకంపాల విషాదంలో.. ఆశాకిరణంలా ఓ అద్భుతం చోటుచేసుకుంది. దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. అంతే.. ప్రపంచ మీడియా వరుస కథనాలతో ఊదరగొడుతోంది. అయితే ఇక్కడే మరో ప్రశ్న కూడా బలంగా వినిపిస్తోంది. అతన్ని బయటకు తీయడానికి ఇన్నిరోజులు ఎందుకు పట్టింది? అని.. జూన్ 24న సంభవించిన 7.2, 7.5 తీవ్రతతో సంభవించిన వరుస భూకంపాలతో.. లా గ్వైరా స్టేట్‌లోని గ్యాలేరియాస్ ప్లాయా గ్రాండే షాపింగ్ మాల్ కుప్పకూలింది. ఆ శిథిలాల కింద చిక్కుకున్న 43 ఏళ్ల భద్రతా సిబ్బంది హెర్నాన్ అల్బెర్టో గిల్ ఫ్లోరెస్‌ను దాదాపు ఎనిమిది రోజుల తర్వాత అంతర్జాతీయ రెస్క్యూ బృందాలు సజీవంగా బయటకు తీశాయి. ఈ ఆలస్యంపై రెస్క్యూ బృందాలు వివరణ ఇచ్చుకున్నాయి. హెర్నాన్ గిల్ చిక్కుకున్న భద్రతా గది పూర్తిగా కూలిపోకపోవడంతో చిన్న గాలి ఖాళీ (ఎయిర్ పాకెట్) ఏర్పడింది. మూడు రోజుల ముందే అతడి ఆచూకీ గుర్తించిన సిబ్బంది చిన్న గొట్టాల ద్వారా నీరు, ఆహారం, ఆక్సిజన్ అందించారు. ఏడు దేశాలకు చెందిన నిపుణులు మూడు మీటర్లకు పైగా సొరంగం తవ్వి అత్యంత జాగ్రత్తగా అతడిని బయటకు తీశారు. మొత్తం ఆపరేషన్‌కు వంద గంటలకు పైగా సమయం పట్టింది. అయితే ఈ రెస్క్యూ ఆలస్యానికి పలు కారణాలు ఉన్నాయని అధికారులు చెబుతున్నారు. భూకంపాల తర్వాత వెనెజువెలాను వందల సంఖ్యలో ఆఫ్టర్‌షాక్స్ వణికిస్తూనే ఉన్నాయి. ఆ ధాటికి కుప్పకూలిన భవనాల శిథిలాలు నిరంతరం కదులుతూనే ఉన్నాయి. దీంతో భారీ యంత్రాలను వినియోగిస్తే శిథిలాలు మరింత కూలిపోయి లోపల చిక్కుకున్న వారి ప్రాణాలకు, రక్షక సిబ్బందికి ప్రమాదం ఏర్పడే అవకాశం ఉండేది. అధికారిక లెక్కల ప్రకారం వెనెజువెలా భూకంపాల్లో.. 2,295 మంది మరణించగా, 11,267 మంది గాయపడ్డారు. ఇంకో 45 వేల మంది జాడ తెలియాల్సి ఉంది. సుమారు 58 వేల భవనాలు కుప్పకూలిపోయాయి. వేలాది కుటుంబాలు

అద భ తమ గ ల డ న అవర స ఎక కడ ప య య Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in