
తమిళనాడు మానవ వనరుల శాఖ మంత్రి డి. శరత్ కుమార్ తీవ్ర వివాదంలో చిక్కుకున్నారు. గతంలో ఒక ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా ఆయన పౌడర్ లాంటి పదార్థంతో కనిపించిన పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ దుమారం చెలరేగింది. వీడియోలో కనిపించింది మాదకద్రవ్యాలేనని, ఆయన వెంటనే రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు, నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఆరోపణలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తున్నాయి.సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న ఈ వీడియోలో.. మంత్రి శరత్ కుమార్ తన స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌పై ఉన్న తెల్లటి పౌడర్‌ను ఒక ఏటీఎం కార్డు, రూ.500 నోటు సహాయంతో కలుపుతున్నట్లు కనిపించింది. ఈ దృశ్యాలు డ్రగ్స్ తీసుకునే విధానాన్ని పోలి ఉండటంతో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యమంత్రి విజయ్ 'డ్రగ్స్‌కు దూరం.. క్రీడలకు దగ్గర' అనే నినాదంతో ఒక మారథాన్ ప్రచారంలో పాల్గొన్న రోజే ఈ వివాదం తెరపైకి రావడం గమనార్హం.ఈ ఆరోపణలపై మంత్రి శరత్ కుమార్ వెంటనే స్పందించారు. తన భార్య, కుమార్తెతో కలిసి ఒక వీడియో ప్రకటన విడుదల చేసి, తనపై వస్తున్న ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. ఈ వీడియో సుమారు రెండేళ్ల నాటిదని, చెన్నైలోని ఎం.ఎ. చిదంబరం స్టేడియంలో తన కుటుంబంతో కలిసి ఐపీఎల్ మ్యాచ్ చూస్తున్నప్పుడు రికార్డ్ చేశారని తెలిపారు."నా కుమార్తెకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో టాబ్లెట్ వేసుకోవాల్సి వచ్చింది. అయితే, ఆమె టాబ్లెట్‌ను మొత్తంగా మింగలేకపోయింది. దాంతో నీటిలో కలిపి ఇచ్చేందుకు దాన్ని పొడిగా చేయమని నా భార్య కోరింది