అది ట్రైలరే.. ఈసారి టార్గెట్ నువ్వే.. రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
Actor ProfileCelebrity

అది ట్రైలరే.. ఈసారి టార్గెట్ నువ్వే.. రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అది ట్రైలరే.. ఈసారి టార్గెట్ నువ్వే.. రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు
AP7AM7 Aug 2026
అది ట్రైలరే.. ఈసారి టార్గెట్ నువ్వే.. రోహిత్ శెట్టికి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరింపులు

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు రోహిత్ శెట్టికి మరోసారి బెదిరింపులు ఎదురయ్యాయి. గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి ఆయనకు తీవ్రమైన హెచ్చరికలు అందాయి. రూ. 20 కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ దుండగులు ఒక ఆడియో క్లిప్ పంపారు. ఈ ఘటన బాలీవుడ్‌లో తీవ్ర కలకలం రేపింది. కొద్ది నెలల క్రితం ఆయన ఇంటిపై కాల్పులు జరిగిన నేపథ్యంలో ఈ తాజా పరిణామం ఆందోళన కలిగిస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. నిన్న‌ ఉదయం రోహిత్ శెట్టి సిబ్బందికి సుమారు 90 సెకన్ల నిడివి గల ఆడియో క్లిప్ వ‌చ్చింది. అందులో "ఫిబ్రవరిలో మీ ఇంటిపై జరిపిన కాల్పులు కేవలం ట్రైలర్ మాత్రమే. డిమాండ్ చేసిన రూ. 20 కోట్లు ఇవ్వకపోతే ఈసారి బుల్లెట్లు నేరుగా నీకే తగులుతాయి" అని గ్యాంగ్‌స్టర్లు హెచ్చరించారు. ఈ వాయిస్, లారెన్స్ బిష్ణోయ్ ముఖ్య అనుచరుడిగా భావిస్తున్న శుభం లోంకర్‌దిగా పోలీసులు అనుమానిస్తున్నారు. 2024లో జరిగిన నేత బాబా సిద్ధిఖీ హత్య కేసుతో పాటు రోహిత్ శెట్టి ఇంటిపై కాల్పుల కేసులో కూడా శుభం లోంకర్ నిందితుడిగా ఉన్నాడు.రోహిత్ శెట్టి సిబ్బంది ఈ ఆడియో క్లిప్‌ను ముంబై క్రైం బ్రాంచ్ పోలీసులకు అందజేశారు. ప్రాథమిక దర్యాప్తు తర్వాత పోలీసులు ఆ వాయిస్‌ను శుభం లోంకర్‌దిగానే భావిస్తున్నారు. పూర్తి నిర్ధారణ కోసం ఆడియో క్లిప్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపినట్లు అధికారులు తెలిపారు.ఈ ఏడాది ఫిబ్రవరిలో జుహూలోని రోహిత్ శెట్టి నివాసం వెలుపల గుర్తుతెలియని వ్యక్తులు ఐదు రౌండ్ల కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఈ దాడికి తామే

అద ట ర లర ఈస ర ట ర గ ట న వ వ ర హ త శ ట ట క ల ర న స బ ష ణ య గ య గ బ ద ర ప ల Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in