అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్
Actor ProfileActor

అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

Total News1
Movie Updates0
Sources1
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్
TV9 Telugu14 Jun 2026
అతను చాలా టాలెంటెడ్.. అలాంటి వాడు ఇంకొకడు లేడు.. ఆసక్తికర విషయం చెప్పిన శుభలేఖ సుధాకర్

తెలుగు చిత్ర పరిశ్రమలో సుదీర్ఘకాలం నటుడిగా రాణించిన వారిలో శుభలేఖ సుధాకర్, తన సినీ ప్రస్థానం, పరిశ్రమలో వచ్చిన మార్పులపై వఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 1989లో శివ చిత్రం విడుదలైన తర్వాత తెలుగు సినీ పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్‌కు మారిన కీలక దశను ఆయన గుర్తు చేసుకున్నారు. అప్పట్లో చెన్నైలో ఇల్లు కొని, ఆర్థికపరమైన కట్టుబాట్లతో ఉన్నందున, తక్షణమే హైదరాబాద్‌కు మారడం సాధ్యపడలేదని సుధాకర్ వివరించారు. ఈ నిర్ణయం తన కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపిందని, అప్పటికే కొత్తతరం దర్శకులు వచ్చి ఇక్కడ ఉన్న నటులకే ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారని ఆయన పేర్కొన్నారు. రామ్ గోపాల్ వర్మతో తన పని అనుభవాన్ని వివరిస్తూ, వర్మ వ్యక్తిత్వంలో అప్పటి నుండి ఇప్పటి వరకు ఎటువంటి మార్పు రాలేదని సుధాకర్ అన్నారు. వర్మకు తన పనిపై బలమైన నమ్మకం, ఒక స్పష్టమైన కన్విక్షన్ ఎప్పుడూ ఉంటుందని, అది విజయం సాధించినా, విఫలమైనా ఆ నమ్మకం చెక్కుచెదరదని, అలాంటి దర్శకుడు మరొకరులేరు అని సుధాఖర్ అన్నారు. ఇది కూడా చదవండి : Jabardasth Vinod: జబర్దస్త్ లేకపోతే ఆ పని చేసేవాడిని.. అసలు విషయం చెప్పిన లేడీ గెటప్ వినోద్ తనతో వర్క్ చేసిన దిగ్దర్శకులలో కె. విశ్వనాథ్, జంధ్యాల, బాపు, క్రాంతి కుమార్, వంశీ వంటి మహానుభావులు ఉన్నారని, వారిలో ప్రతి ఒక్కరి శైలి ప్రత్యేకమైనదని ఆయన గుర్తు చేసుకున్నారు. కె. విశ్వనాథ్ గారు పాత్రలను సహజంగా చూపించడానికి పని చేస్తూ డైలాగులు చెప్పించేవారని, జంధ్యాల గారు డైలాగ్ టైమింగ్‌కు ప్రాధాన్యత ఇచ్చేవారని, బాపు గారు ఫ్రేమింగ్‌లో అందాన్ని పండించేవారని, క్రాంతి కుమార్ గారు కొత్త ఆలోచనలతో ముందుకు సాగేవారని, వంశీ గారు సంగీతానికి ప్రాధాన్యతనిస్తూ గోదావరి నేటివిటీని ప్రతిబింబించేవారని సుధాకర్ వివరించారు. ఇది కూడా చదవండి : ఇప్పుడున్న హీరోల్లో అతనొక్కడే నన్ను ఆంటీ అని పిలుస్తాడు.. జయసుధ ఆసక్తికర కామెంట్స్ దర్శకుడు వంశీ