
వైసీపీ పార్టీ (YCP Party)తో వ్యక్తిగతంగా ఎటువంటి శత్రుత్వం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. పవన్ కల్యాణ్ అధ్యక్షతన జనసేన నిర్మాణ సారథుల సమాచార సేకరణ కమిటీ కార్యాచరణ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ వారి విధివిధానాలను ప్రశ్నిస్తే, తనపై వ్యక్తిగతంగా విమర్శలు చేస్తున్నారని తెలిపారు. మెత్తగా ఉండాలి కానీ, మరీ మౌనంగా ఉంటే చేతకానితనంగా చూస్తారు. ఇటీవల పంతం నానాజీ (Pantham Nanaji) మాట్లాడింది నేను చూశాను. అటువంటివి సమర్థించం. కానీ అదే ప్రాంతంలో ఉన్న వైసీపీ నేత ఏం మాట్లాడారో ఆ పార్టీ నాయకులకు తెలీదా. మీకు నోరుంది కదా అని అధికారంలో ఉన్నప్పుడు నోటికొచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు కూడా అదే విధంగా మాట్లాడుతున్నారు. ఎక్కడా తగ్గకండి.11 సీట్లు కాదు, ఒక్కస్థానానికి చేరినా, ఇలాగే ఇష్టారాజ్యంగా మాట్లాడండి. సీఎం చంద్రబాబు (Chandrababu) సతీమణి గురించి మాట్లాడితే ప్రశ్నించకూడదా. అసలు మీలో రియలైజేషన్ ఎంతవరకు వస్తుందో మేమూ చూస్తాం. మీరు తిట్టినా, తిట్టకపోయినా, మేము బలపడటం గ్యారంటీ అని అన్నారు