అజిత్ ... వాట్ నెక్ట్స్
Actor ProfileActor

అజిత్ ... వాట్ నెక్ట్స్

Total News1
Movie Updates0
Sources1
అజిత్ ... వాట్ నెక్ట్స్
Chitrajyothy16 Jun 2026
అజిత్ ... వాట్ నెక్ట్స్

అజిత్‌ తన కొత్త సినిమా ఇంతవరకూ ప్రకటించపోవడంతో కోలీవుడ్‌లో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అజిత్‌ డిమాండ్‌ చేసిన పారితోషికాన్ని నిర్మాతలు ఇవ్వడానికి ఆసక్తి చూపడంలేదనే వార్తలూ ప్రచారంలో ఉన్నాయి. బాక్సాఫీస్ బరిలో అజిత్‌ కుమార్‌ (Ajith Kumar) కు పోటీ ఇచ్చిన ఏకైక వ్యక్తి విజయ్‌ (Vijay). వీరిద్దరి ఫ్యాన్స్ మధ్య జరిగే వార్‌ చూస్తే గతంలో రజనీకాంత్‌ (Rajinikanth) - కమల్ హాసన్ (Kamal Hassan) అభిమానుల మధ్య జరిగిన గొడవలు గుర్తొస్తాయి. అయితే అజిత్ - విజయ్‌ ఫ్యాన్స్ మధ్య పోటీ అధికంగా సోషల్ మీడియా లోనే జరుగుతూ ఉంటుంది. అది మరీ వికటించినప్పుడు ఒకరిపై ఒకరు వాల్ పోస్టర్స్ వేసుకునే వరకూ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు విజయ్‌ నటనకు స్వస్తి చెప్పి, రాజకీయ పార్టీ పెట్టి, ఏకంగా తమిళనాడు సీఎం అయిపోయారు కాబట్టి... అజిత్‌కు సమ ఉజ్జీ చిత్రసీమలో లేరనే చెప్పాలి. అందువల్లే అజిత్‌ తదుపరి చిత్రం ఏదనే విషయమై రకరకాల వార్తలు కోలీవుడ్ లో చక్కర్లు కొడుతున్నాయి. గత యేడాది అజిత్‌ నటించిన రెండు సినిమాలు 'విడుమార్చి', 'గుడ్ బ్యాడ్‌ అగ్లీ' (Good Bad Ugly) బ్యాక్‌ టు బ్యాక్ విడుదలయ్యాయి. ఈ రెండు కూడా అజిత్‌ ఇమేజ్‌ కారణంగా ఓ మాదిరిగా ఆడాయి తప్పితే... ఘన విజయాన్ని సాధించలేదు. అయితే ఆ సినిమాల ముందు, ఆ తర్వాత కూడా అజిత్‌ మోటర్ రేసింగ్‌ మీద దృష్టి పెట్టి భారత పతాకాన్ని విదేశీ గడ్డ మీద ఎగురవేయడానికి ప్రాధాన్యమిచ్చారు. అందులో సఫలం కూడా అయ్యారు. దాంతో ఆయన కొంతకాలంగా నటన మీద దృష్టి పెట్టలేదు. ఇప్పుడు సినిమా విడుదలై యేడాదిన్నర గడిచి పోయిన నేపథ్యంలో అజిత్‌ అభిమానులు ఆయన నుంచి సినిమాను ఆశిస్తున్నారు. కానీ ఇంతవరకూ అజిత్‌ తన తదుపరి చిత్రంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇదే సమయంలో కోలీవుడ్ వరుస పరాజయాలను అందుకుంటున్న

అజ త వ ట న క ట స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in