
ఐసీసీ తాజాగా విడుదల చేసిన వారాంత ర్యాంకింగ్స్‌లో టీమిండియా పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ సరికొత్త నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. ఈ క్రమంలో సహచర టీమిండియా విధ్వంసకర బ్యాటర్ అభిషేక్ శర్మను రెండో స్థానానికి నెట్టాడు. ఇషాన్, అభిషేక్ మధ్య 7 పాయింట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది. ఇషాన్ ఖాతాలో 876 రేటింగ్ పాయింట్లు ఉండగా.. అభిషేక్ ఖాతాలో 869 రేటింగ్ పాయింట్లు ఉన్నాయి. మరోపక్క టెస్ట్ బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో ఆసీస్ ఆటగాడు ట్రవిస్ హెడ్ అగ్రపీఠాన్ని అధిరోహించాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు జో రూట్, హ్యారీ బ్రూక్‌ను వెనక్కు నెట్టి టాప్ ప్లేస్‌కు చేరాడు. హెడ్ (853), బ్రూక్ (852), రూట్ (840) మధ్య పాయింట్ల వ్యత్యాసం చాలా తక్కువగా ఉంది. ఇక్కడ గమనించదగ్గ మరో విషయం ఏంటంటే.. ఈ వారం ర్యాంకింగ్స్‌లో సన్‌రైజర్స్ బ్యాటర్ల హవా కొనసాగింది. ఆ జట్టు టాప్-3 ప్లేయర్లు టీ20, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అత్యున్నత శిఖరాలను అధిరోహించారు. ముఖ్యంగా ఇషాన్ కిషన్ గురించి మాట్లాడుకోవాలి. కొంతకాలం కిందట అతడికి టీమిండియాలో చోటే లేదు. అలాంటిది ఇప్పుడు ఏకంగా ప్రపంచ నంబర్ వన్ టీ20 బ్యాటర్‌గా అవతరించాడు. అలాగే భారత వన్డే జట్టులో కూడా చోటు సంపాదించాడు. భారత్ తాజా టీ20 టైటిల్ సాధించడంలో అత్యంత కీలకపాత్ర పోషించాడు. ఓ దశలో జట్టులో చోటే లేని ఇషాన్ అద్భుతమైన కమ్‌బ్యాక్ ఇచ్చి తానేంటో ప్రపంచానికి చాటాడు. టీమిండియాలో చోటుతో పాటు బీసీసీఐ కాంట్రాక్ట్‌ను కూడా కోల్పోయిన ఇషాన్.. దేశవాలీ క్రికెట్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగి మరోసారి టీమిండియా తలుపులు తట్టాడు. జాతీయ జట్టులోకి రీఎంట్రీకి ముందు దాదాపుగా ప్రతి దేశవాలీ టోర్నీలోనూ శతకాలు బాదాడు. కెప్టెన్‌గానూ తన జట్టుకు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ అందించాడు. ఈ ప్రదర్శనల కారణంగా భారత టీ20 జట్టులోకి వచ్చి, వచ్చీ రాగానే తన మార్కును చూపించాడు. న్యూజిలాండ్‌పై సెంచరీతో పాటు




