
ఆర్థిక ఇబ్బందుల వల్ల ఏ ఒక్క ప్రతిభావంతుడైన విద్యార్థి కూడా ఉన్నత విద్యకు దూరం కాకూడదనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ . ఈ పథకం కింద దేశంలోని అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందిన విద్యార్థులకు ఎలాంటి గ్యారెంటీ లేకుండానే విద్యా రుణాలు అందిస్తారు. ప్రతిభ ఉండి, పైచదువులు చదవాలనుకునే మధ్యతరగతి, పేద విద్యార్థులకు ఈ పథకం ఒక వరమనే చెప్పాలి.పీఎం విద్యాలక్ష్మి పథకం ముఖ్య ఉద్దేశాలు:విద్యార్థులు వేర్వేరు బ్యాంకుల చుట్టూ తిరిగే పనిలేకుండా ఒకే పోర్టల్ ద్వారా రుణాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 7.5 లక్షల వరకు రుణం తీసుకునే విద్యార్థులకు ప్రభుత్వం 3 శాతం వడ్డీ సబ్సిడీని అందిస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8లక్షల లోపు ఉన్నవారికి ఇది వర్తిస్తుంది. రూ. 10 లక్షల వరకు తీసుకునే రుణాలకు ఎలాంటి గ్యారెంటీ లేదా కో-అప్లికెంట్ అవసరం లేదు.అర్హత ప్రమాణాలుదరఖాస్తు చేసుకునే విద్యార్థి తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. కేంద్రప్రభుత్వం నిర్దేశించిన దేశంలోని టాప్-860 ఉన్నత విద్యాసంస్థల్లో ప్రవేశం పొంది ఉండాలి. ఇందులో ఐఐటీలు, ఐఐఎంలు, నిట్‌లు మరియు కేంద్ర ప్రభుత్వ విశ్వవిద్యాలయాలు ఉంటాయి. అడ్మిషన్ పూర్తిగా మెరిట్ ఆధారంగా లేదా ప్రవేశ పరీక్షల ద్వారా సాధించి ఉండాలి.కావాల్సిన డాక్యుమెంట్స్ ఇవేదీని కోసం విద్యార్థి, తల్లిదండ్రుల ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, విద్యాసంస్థలో సీటు వచ్చినట్లు తెలిపే అడ్మిషన్ లెటర్ మరియు ఫీజ్ స్ట్రక్చర్ రశీదు కావాలి. పదో తరగతి, ఇంటర్మీడియట్ లేదా డిగ్రీ మార్కుల పత్రాలు, కుటుంబ వార్షిక ఆదాయ ధృవీకరణ పత్రం,పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు మరియు బ్యాంక్ ఖాతా వివరాలు కావాలి.దరఖాస్తు చేసుకునే విధానంముందుగా పీఎం విద్యాలక్ష్మి అధికారిక వెబ్‌సైట్ (PM Vidyalaxmi Portal) ను ఓపెన్ చేయాలి. హోమ్‌పేజీలో ఉన్న Register ఆప్షన్‌పై క్లిక్ చేసి విద్యార్థి పేరు, ఈమెయిల్ ఐడీ, మొబైల్ నంబర్, పాస్‌వర్డ్ నమోదు చేసి