అక్టోబ ర్ నాటికి పూర్తి కానున్న వార ణాసి
Actor ProfileCelebrity

అక్టోబ ర్ నాటికి పూర్తి కానున్న వార ణాసి

📊 Box Office Collections
Total News1
Movie Updates0
Sources1
అక్టోబ ర్ నాటికి పూర్తి కానున్న వార ణాసి
Telugu Times27 Jul 2026
అక్టోబ ర్ నాటికి పూర్తి కానున్న వార ణాసి

ఎస్.ఎస్. రాజమౌళి(SS Rajamouli) తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా వార‌ణాసి(Varanasi) పై అంతర్జాతీయ స్థాయిలో ఆసక్తి నెలకొంది. 2027 ఏప్రిల్‌లో విడుదలకు సిద్ధమవుతున్న ఈ సినిమా గురించి రాజమౌళి తాజాగా కీలక అప్‌డేట్ ఇచ్చారు. కథ వేల సంవత్సరాల కాలవ్యవధిని దాటుతూ, వారణాసి నగరాన్ని కేంద్రంగా చేసుకుని సాగుతుందని, అంతేకాదు అంటార్కిటికా వంటి అత్యంత దూర ప్రాంతాలు కూడా కథలో భాగమవుతాయని వెల్లడించారు. భారీ స్థాయి విజువల్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ఒక ఆస్టరాయిడ్, వారణాసిని ఢీకొనే ప్రమాదం ప్రధాన కథాంశంగా ఉండనుందని సమాచారం. ఈ సినిమా కోసం 70 ఎంఎం ఐమ్యాక్స్ ఫార్మాట్‌ను కూడా వినియోగిస్తున్నారు. తాజాగా ఓ అంతర్జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రాజమౌళి షూటింగ్ పురోగతిపై ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పటికే సినిమాలోని ప్రధాన భారీ యాక్షన్ సన్నివేశాలన్నీ పూర్తయ్యాయని ఆయన తెలిపారు. ప్రస్తుతం కథను అనుసంధానించే చిన్నచిన్న సీన్స్ షూటింగ్ కొనసాగుతోందని, సెప్టెంబర్ చివరి లేదా అక్టోబర్ ప్రారంభానికి మొత్తం షూటింగ్ పూర్తి చేసే టార్గెట్ తో టీమ్ వ‌ర్క్ చేస్తోంద‌ని చెప్పారు. దీంతో పోస్ట్ ప్రొడక్షన్ వ‌ర్క్స్ కు మరింత సమయం దక్కనుంది. ఐమ్యాక్స్ ఫార్మాట్ కోసం ప్రత్యేకంగా సీన్స్ ను మార్చలేదని కూడా రాజమౌళి స్పష్టం చేశారు. మొదటి నుంచే కొన్ని విజువల్ సీక్వెన్స్‌లు ఐమ్యాక్స్‌లోనే అత్యుత్తమంగా కనిపిస్తాయని భావించి వాటిని అలానే డిజైన్ చేశామని తెలిపారు. అయితే సాధారణంగా సినిమాస్కోప్‌లో షూటింగ్ కు అలవాటుపడిన కారణంగా, ఐమ్యాక్స్‌తో పాటు అనామార్ఫిక్ ఫ్రేమింగ్‌లోనూ ప్రతి షాట్ సమర్థవంతంగా కనిపించేలా ప్రారంభ రోజుల్లో కొంత మార్పులు చేసుకోవాల్సి వచ్చిందన్నారు. ఆ తర్వాత సరైన ఫ్రేమింగ్‌పై స్పష్టత రావడంతో షూటింగ్ మరింత సులభంగా సాగిందని రాజమౌళి వెల్లడించారు

అక ట బ ర న ట క ప ర త క న న న వ ర ణ స Latest News, Movies & Updates | nimisham.in | nimisham.in