మదనపల్లె నేరవార్తలు: అన్నమయ్య జిల్లా మదనపల్లెలో పీ అండ్ టీ కాలనీలో నివాసం ఉండే విశ్రాంత ఆర్డబ్ల్యూఎస్ డీఈ రవీంద్ర ఇంట్లో భారీ చోరీ జరిగింది. ఇంట్లో దాచిన 670 గ్రాముల బంగారం, 2 కిలోల వెండి, రూ.25 వేల నగదును దుండగులు ఎత్తుకెళ్లారు. బుధవారం రాత్రి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు గ్రిల్స్ కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.