కింగ్ (King)

Instagram 80s Photo Trend : ఇన్‌స్టాగ్రామ్‌లో 80s ఫీవర్.. స్టూడియో గిబ్లీ స్టైల్, ఏఐ టాయ్ ఫిగర్ ట్రెండ్స్ తర్వాత ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్‌లో మరో ఏఐ టూల్ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. అదే (80s Photo Trend) మీ నార్మల్ ఫొటోను ఒక్క ప్రాంప్ట్‌తో 1980ల నాటి సినిమా స్టిల్లా మార్చుకోవచ్చు. ఒకప్పుడు భారతీయ ఇళ్లలో కలర్ టీవీ కొత్త సందడి తీసుకొచ్చిన కాలం 80 నాటిది..

ఆ దశాబ్దపు ఫ్యాషన్, హెయిర్‌స్టైల్స్, చీరలు, పెద్ద చెవిపోగులు, ప్రింటెడ్ షర్ట్స్, హై-వేస్టెడ్ ప్యాంట్స్, వార్మ్ లైటింగ్.. ఇవన్నీ ఇప్పుడు ఏఐ ఫిల్టర్ ద్వారా మళ్లీ ట్రెండ్ అవుతున్నాయి. ఇందులో ఫేస్ మాత్రం మనదే. కానీ లుక్ మాత్రం పాతకాలపు సినిమా హీరో లేదా హీరోయిన్లా మారిపోతుంది. కొందరు దీన్ని బాలీవుడ్ పోస్టర్లా మరికొందరు పాత ఫ్యామిలీ ఆల్బమ్‌లా, ఇంకొందరు వింటేజ్ మ్యాగజైన్ కవర్లా క్రియేట్ చేస్తున్నారు.

మీ ఫొటోను 80s లుక్‌లోకి ఎలా మార్చాలి? :
ఇందుకోసం ఎలాంటి ఫొటో ఎడిటింగ్ స్కిల్స్ అవసరం లేదు. చాట్ జీపీటీలో మీ ఫొటోను అప్లోడ్ చేసి మీకు కావాల్సిన లుక్‌ను క్లియర్ గా అడగడమే..

స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ :

ChatGPT ఓపెన్ చేయండి

కొత్త చాట్‌లో + ఐకాన్‌ను నొక్కండి

మీకు నచ్చిన HD ఫొటోను అప్లోడ్ చేయండి.

లుక్ ఎలా ఉండాలో చెప్పండి.. 80నాటి బాలీవుడ్, వింటేజ్ ఫ్యామిలీ ఆల్బమ్, రెట్రో డిస్కో వంటి స్టైల్ ఎంచుకోండి.

డీటెయిల్స్ ఇవ్వండి : దుస్తులు, హెయిర్‌స్టైల్, జ్యువెలరీ, బ్యాక్‌గ్రౌండ్, లైటింగ్, కలర్ టోన్ వంటివి చెప్పండి.

ఫేస్ మారకూడదని చెప్పండి : మీ facial features, natural skin tone అలాగే ఉంచమని ప్రాంప్ట్ లో అడగండి.

రిజల్ట్ చెక్ చేయండి : ఏదైనా నచ్చకపోతే మొత్తం ప్రాంప్ట్ మార్చొద్దు.. “హెయిర్‌ను మరింత 80s స్టైల్లో మార్చండి” అని మాత్రమే అడగండి.

80s హీరోయిన్ లుక్ కోసం ఈ కింది ఇంగ్లీష్ ప్రాంప్ట్ ట్రై చేయండి :
ఈ ఫోటోను 1980s నాటి గ్లామరస్ ఇండియన్ సినిమా హీరోయిన్ పొర్ట్రైట్గా మార్చండి. వ్యక్తి ఫేస్ ఫీచర్స్, ఫేషియల్ ఎక్స్ప్రెషన్, న్యాచురల్ స్కిన్ టోన్ ఏమాత్రం మారకుండా అలాగే ఉంచండి. వాల్యూమినస్ సాఫ్ట్ కర్ల్స్‌తో ఆథెంటిక్ 80s హెయిర్‌స్టైల్, బ్రైట్ ట్రెడిషనల్ ఇండియన్ అవుట్‌ఫిట్, స్టేట్మెంట్ వింటేజ్ ఇయర్రింగ్స్, సబ్టిల్ మేకప్, వార్మ్ స్టూడియో లైటింగ్, రిచ్ వైబ్రెంట్ కలర్స్, సాఫ్ట్ ఫోకస్, రియలిస్టిక్ వింటేజ్ ఫిల్మ్ గ్రెయిన్ యాడ్ చేయండి.