
రాజాం: విజయనగరం జిల్లా రాజాం మండలం బద్దం గ్రామంలో 150 కిలోల పసుపు కొమ్ములతో భారీ వినాయకుడిని తీర్చిదిద్దారు. ఈ భారీ వినాయకుడు అత్యంత ప్రత్యేకంగా పర్యావరణహితంగా రూపుదిద్దుకుంది. వినాయక చవితి వేడుకల్లో భాగంగా, చాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో కేవలం మట్టి విగ్రహాలకే పరిమితం కాకుండా వినూత్నంగా ఆలోచించి 21 రోజుల కష్టంతో 15 అడుగుల భారీ ఎత్తుతో 150 కిలోల పసుపు కొమ్ములను ఉపయోగించి ఈ భారీ గణనాథుడిని అద్భుతంగా తీర్చిదిద్దారు. రసాయన రంగులు, ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వంటి హానికరమైన పదార్థాలను వాడకుండా పూర్తిగా పకృతిసిద్ధమైన పసుపు కొమ్ములతో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. నవరాత్రి పూజలు, నిమజ్జనోత్సవం పూర్తయిన తర్వాత, విగ్రహానికి ఉపయోగించిన ఈ పసుపు కొమ్ములను భక్తులకు పవిత్ర ప్రసాదంగా పంపిణీ చేస్తారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.



.webp)

