
హైదరాబాద్ : రేవంత్ రెడ్డి పాలనలో తెలంగాణ లో శాంతి భద్రతలు ( law and order ) రోజురోజుకు దిగజారుతున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి( Vemula Prashanth Reddy ) ఆరోపించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీఏ మహేందర్ రెడ్డి ( PA Mahendar Reddy ) , పీఆర్వో మహేష్ ( PRO Mahesh ) ను వినాయక చవితి రోజున విచారణ పేరుతో సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లడం దారుణమని అన్నారు.వారిపై కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండించారు. పోలీసుల సమక్షంలోనే మాస్కులు ధరించిన 15 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మహేందర్ రెడ్డి, మహేష్‌పై దాడి చేయడానికి యత్నించడం మరింత ఆందోళనకరమని పేర్కొన్నారు. బీఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాదులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయిన ఘటనపై పోలీసులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. పోలీస్ స్టేషన్లోనే దాడికి యత్నించే స్థాయికి కాంగ్రెస్ గుండాల అరాచకం పెరగడం తెలంగాణలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని దుయ్యబట్టారు. దాడికి యత్నించిన వారిని వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వేముల ప్రశాంత్ రెడ్డి డిమాండ్ చేశారు.




