
కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాలు కూడా రాస్తుంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. Telangana Government Hospitals: సనత్ నగర్ టిమ్స్… తెల్లటి సౌధం. 22.6 ఎకరాల విస్తీర్ణంలో 1082 పడకల సామర్థ్యంతో భారీ భవన సముదాయం. కంటి నిండా కనబడే దివ్యరూపం… అద్భుతమైన కట్టడం. మూడు బ్లాకులు, ఐదు అంతస్తులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. నిర్మాణ దశలో ఉన్నపుడు ఏదో ప్రైవేటు కట్టడమనుకున్నారు. నిర్మాణపనులు పూర్తయిన తర్వాత.. గవర్నమెంటు ఆస్పత్రి ఇంత పెద్ద బిల్డింగ్ లో పెడుతున్నారని అందరూ ఆశ్చర్చపోయారు. ఈ ఆస్పత్రి సముదాయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతులమీదుగా గత నెలలో లాంఛనంగా ప్రారంభమైంది. ప్రస్తుతం ఆ హాస్పిటల్‌కు ప్రస్తుతం హాస్పిటల్‌కు చుట్టుపక్కల ప్రాంతాల వారు వస్తున్నారు. మరోవైపు హైదరాబాద్ నలుమూలల నుంచి తెలంగాణ నుంచి వచ్చే వాళ్లకు గాంధీ, ఉస్మానియా హాస్పిటల్‌కు ప్రత్యామ్నాయంగా తెలంగాణ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి మాజీ ముఖ్యమంత్రి మరియు గవర్నర్ మర్రి చెన్నారెడ్డి పేరును పెట్టారు. ఆధునిక హంగులు అద్దుకున్న సర్కారు దవాఖానా.. అరుదైన రోగాలను నయం చేయడంలో ముందుంది. ప్రాణాంతకర పరిస్థితుల్లో వచ్చినవారికి పాణం నిలబెట్టే విధంగా దీన్ని తీర్చిదిద్దారు. ఎలాంటి అనారోగ్య సమస్యతో వచ్చినా… పెద్దా స్పత్రిలో చూపించుకున్నాననే భావనతతో మానసిక సంతృప్తి అందించడమే కాదు.. అందుకు అవసరమైన వైద్యసేవలు అందించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా తీర్చి దిద్దుతుందనే విశ్వాసం ఇక్కడ డాక్టర్లు పేసెంట్స్కు కల్పించే పనిలో పడ్డారు. కిడ్నీ, గుండె, లివర్ మార్పిడి టిమ్స్ ప్రత్యేకత.... అనారోగ్యంతో ఉన్నవారికి నయం