
TG Assembly Session : వరస సెలవుల అనంతరం అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు(Monsoon Session) మళ్లీ మొదలవ్వనున్నాయి. ఎనిమిదో సెషన్ రెండో సమావేశం.. ఏడో రోజు సభ బుధవారం ఉదయం 10 గంటలకు ప్రారంభం అవుతుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో ప్రధాన్యమున్న(స్టార్ గుర్తున్న) అంశాలను ప్రస్తావించనున్నారని ఆయన తెలిపారు. మూడు రోజుల వరస సెలవుల తర్వాత తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మళ్లీ షురూ కానున్నాయి. బుధవారం ఉదయం 10 గంటలకు సభ మొదలవ్వనుందని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి వెల్లడించారు. ప్రశ్నోత్తరాల సమయంలో స్టార్ గుర్తున్న ప్రశ్నలు, ఆపై షార్ట్ డిస్కషన్లో.. వివాదాస్పదంగా మారిన సెక్షన్ 22ఏ రిజిష్ట్రేషన్ చట్టంపై చర్చ కొనసాగనుంది. రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలపై ప్రభావం చూపిన ఎల్‌నినోపై, ప్రభుత్వం తీసుకున్న చర్యలపై చర్చ ఉంటుంది అని అసెంబ్లీ కార్యదర్శి రెండ్ల తిరుపతి పేర్కొన్నారు.