
Tax On Equity Profit: ప్రస్తుత రోజుల్లో హైరిటర్న్స్ కోసం స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్లలో ఇన్వెస్ట్ చేస్తున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రిస్క్ ఉన్నప్పటికీ మంచి రాబడులు అందుకునేందుకు ఈ మార్గాలను ఎంచుకుంటున్నారు. అయితే, వీటిల్లో హైరిటర్న్స్తో పాటు ఆదాయపు పన్ను ట్యాక్స్ సైతం పడుతుందని గుర్తుంచుకోవాలి. మరి షేర్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.3 లక్షల లాభం వచ్చినట్లయితే ఎంత ట్యాక్స్ కట్టాల్సి వస్తుంది? అనే లెక్కలు తెలుసుకుందాం.





