
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 వీకెండ్ ఎపిసోడ్ ఆడియన్స్‌కు విపరీతమైన థ్రిల్‌ను అందిస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో 3 సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఈ వీకెండ్ ఎపిసోడ్లో మరో ఎలిమినేషన్ ఉంటుందని ట్విస్ట్ ఇచ్చారు హోస్ట్ నాగార్జున. ఇప్పటికే తొలివారంలోనే హౌస్‌లో మిడ్-వీక్ ఎలిమినేషన్ పేరుతో ఇద్దరు కంటెస్టెంట్లను పంపించేయడం సంచలనంగా మారింది. మూడో రోజున చరణ్, అలాగే నాలుగో రోజున చైత్రా రాయ్‌లను ఇంటి సభ్యుల ఓటింగ్ ప్రకారమే ఎలిమినేట్ చేశారనే వార్తలు బయటకు వచ్చాయి. ఆడియన్స్ ఓటింగ్‌తో సంబంధం లేకుండా కేవలం కంటెస్టెంట్స్ ఇచ్చిన నిర్ణయంతోనే వీళ్ళను పంపేయడంపై నెటిజన్ల నుండి విమర్శలు కూడా వ్యక్తమయ్యాయి. అయితే చరణ్, చైత్రల మిడ్-వీక్ ఎలిమినేషన్ల వెనుక బిగ్ బాస్ ఏదైనా పెద్ద ట్విస్ట్ ప్లాన్ చేసి ఉంటాడని, వీకెండ్లో నాగార్జున వీరిద్దరినీ మళ్లీ హౌస్‌లోకి తీసుకువచ్చే అవకాశం ఉందనే టాక్ బలంగా వినిపిస్తోంది.





