
ఆక్స్ఫర్డ్ వర్సిటీకి సీఎం రేవంత్ ఆహ్వానం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ఆక్స్ఫర్డ్ విద్యావేత్తలతో ముఖ్యమంత్రి సమగ్ర చర్చలు తెలంగాణ యువత, ఉద్యోగ నిపుణులతో కలిసి పనిచేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసిన ఆక్స్ఫర్డ్ ప్రతినిధులు సోమర్విల్ కాలేజీలో దివంగత మాజీ ప్రధాని ఇందిరా చిత్రపటాన్ని సందర్శించిన సీఎం రేవంత్ లండన్, ఆగస్టు 21, 2026: తెలంగాణలో విద్యా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపట్టాలని… లండన్ లోని ప్రపంచ ప్రఖ్యాత ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ ఆహ్వానం పలికారు. తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందంలో భాగంగా ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌రెడ్డి శుక్రవారం 900 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రపంచ ప్రఖ్యాత లండన్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని సందర్శించారు. తెలంగాణతో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ భాగస్వామ్య అవకాశాలు, రాష్ట్ర యువతకు ప్రపంచస్థాయి విద్య, పరిశోధన అవకాశాలు కల్పించే అంశాలపై ప్రముఖ విద్యావేత్తలతో విస్తృతంగా చర్చించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌కు చెందిన ప్రొఫెసర్ మాయా ట్యూడర్, బేలియోల్ కాలేజీకి చెందిన ప్రొఫెసర్ ఫైసల్ దేవ్జీతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్’ విజన్‌ను వారికి సమగ్రంగా వివరించారు. హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి విద్యా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందిస్తున్న ప్రణాళికలు, చేపడుతున్న చర్యలను వివరించారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ తమ ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ కార్యక్రమాలు, ప్రత్యేక పరిశోధన సామర్థ్యాలు, విస్తృతమైన విద్యా వ్యవస్థను హైదరాబాద్‌కు తీసుకురావాలని ముఖ్యమంత్రి ఆహ్వానించారు. హైదరాబాద్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తెలంగాణ యువతకు, ఉద్యోగ నిపుణులకు ప్రపంచస్థాయి విద్యా, పరిశోధన అవకాశాలు అందించేందుకు ముందుకు రావాలని కోరారు. ఈ కీలక సమావేశంలో సీఎం కార్యాలయ సలహాదారు, ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వ జాతీయ విద్యా విధానం కింద విదేశీ విశ్వవిద్యాలయాలకు అందుబాటులో ఉన్న అవకాశాలపై ఆయన సమగ్ర ప్రజెంటేషన్ ఇచ్చారు. హైదరాబాద్, తెలంగాణలో విదేశీ విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న