
Srirasthu | నటుడు ప్రణమ్ దేవరాజ్ కథానాయకుడిగా, టాలెంటెడ్ బ్యూటీ సంజనా ఆనంద్ హీరోయిన్గా నటిస్తోన్న తాజా చిత్రం ‘శ్రీరస్తు’. హరి క్రియేషన్స్ పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా శంకర్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. పెండ్లిమడుగు హరి కృష్ణ గౌడ్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం తెలుగు, కన్నడ భాషల్లో ఏకకాలంలో ద్విభాషా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. కుటుంబ విలువలకు పెద్దపీట వేస్తూనే, సరికొత్త యూత్ ఫుల్ కామెడీ ఎంటర్టైనర్గా ఈ చిత్రాన్ని మలుస్తున్నారు. ముఖ్యంగా హీరో హీరోయిన్ల మధ్య సాగే క్యూట్ లవ్ స్టోరీ, వారిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలు సినిమాకే ప్రధాన హైలైట్గా నిలవనున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను, ముఖ్యంగా యువతను ఈ సినిమా కచ్చితంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. ఈ చిత్రంలో మరో ప్రత్యేక ఆకర్షణగా కన్నడ స్టార్ హీరో ప్రజ్వల్ దేవరాజ్ కీలక పాత్రలో నటిస్తుండటం విశేషం. వీరితో పాటు సుమన్, దేవి ప్రసాద్, ఆమని, చైత్ర రాయ్, ప్రసాద్ బెహ్రా, రవి ప్రకాష్, రవి శివ తేజ వంటి అనుభవజ్ఞులైన ప్రముఖ నటీనటులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. సాంకేతిక నిపుణుల విషయానికి వస్తే, ఈ సినిమాకు టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ శేఖర్ చంద్ర అద్భుతమైన బాణీలు సమకూరుస్తున్నారు. బాల సరస్వతి సినిమాటోగ్రఫీ, శ్రీ వర్కల ఎడిటింగ్, కృష్ణ మాయ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలు సినిమా స్థాయిని మరింత పెంచుతున్నాయి. ప్రస్తుతం సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్ను విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. త్వరలోనే ఈ అల్లరితో కూడిన కుటుంబ కథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
