
"శనార్తి" అనే పదానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. వీరశైవ, లింగాయత సంప్రదాయంలో ఒకరినొకరు "శరణు", "శరణార్థిగళు" అంటూ గౌరవంగా పలకరించే ఆచారం ఉంది. ఒకప్పుడు తెలంగాణ ప్రాంతంలో వీరశైవ ప్రభావం ఎక్కువగా ఉండటంతో ఈ పలకరింపు స్థానిక భాషలో మార్పులు చెంది వ్యావహారిక రూపాన్ని సంతరించుకుందని భావిస్తారు. తెలంగాణ మాండలికంలో మహాప్రాణాలు అల్పప్రాణాలుగా మారడం, "ణ" అక్షరం "న"గా పలకడం, రేఫం లుప్తమవడం వంటి భాషా మార్పుల వల్ల ఈ పదం క్రమంగా ఇలా రూపాంతరం చెందిందని అంచనా వేస్తారు. శరణు → శరణార్థులు → శరనార్తులు → శనార్తులు → శనార్తి. అందువల్ల "శనార్తి" అనేది గౌరవంతో నమస్కారం చేయడం, శరణు కోరడం అనే భావాన్ని కలిగిన తెలంగాణ వ్యావహారిక పదంగా గుర్తింపు పొందింది. శనార్తి పేరుతో కొత్త సినిమా ప్రారంభం కావడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. దర్శకుడు గణేష్ రాజ్ ఉప్పునూటి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో తెలంగాణ ఫోక్ డాన్సర్ నాగ దుర్గ కథానాయికగా, అఖిల్ రాజు హీరోగా నటిస్తున్నారు. టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. సినిమా పోస్టర్ కూడా పూర్తిగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా రూపొందించారు. పోస్టర్లో అమ్మాయి, అబ్బాయి ఒకరి చిటికెన వేలును మరొకరు పట్టుకున్న రెండు చేతులు కనిపించాయి. ఆ చేతులకు పసుపు, కుంకుమలు ఉండటం పవిత్రమైన బంధాన్ని సూచిస్తోంది. అలాగే మామిడి ఆకులతో కట్టిన కంకణాలు, మహిళ చేతికి ఉన్న ఎర్రటి గాజులు పోస్టర్‌కు మరింత సంప్రదాయ స్పర్శను తీసుకొచ్చాయి. ఇవన్నీ చూస్తే పెళ్లి, జాతర లేదా గ్రామీణ సంప్రదాయాల నేపథ్యంలో సాగే ప్రేమకథ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ పోస్టర్‌పై "A Tale of Culture" అనే ట్యాగ్‌లైన్ సినిమా కథపై ఆసక్తిని పెంచుతోంది. అంటే ఇది కేవలం ప్రేమకథ మాత్రమే కాకుండా తెలంగాణ సంస్కృతి, ఆచారాలు, కుటుంబ బంధాలు, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించే