
ప్రతీ ఒక్కరికీ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చిన్న చిన్న సమస్యల నుంచి పెద్ద హెల్త్ ప్రాబ్లమ్ వరకూ ఎన్నో సమస్యలు ఒంటిపై దాడి చేస్తాయి. చిన్నవి అలా వచ్చి ఇలా వెళ్లిపోతే పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ మాత్రం వచ్చే ముందు సిగ్నల్స్‌లా కొన్ని సింప్టమ్స్‌ని చూపిస్తాయి. వీటి ఇలా చూపించినప్పుడు వాటిని మనం చిన్నవని నిర్లక్ష్యం చేసి ఏవేవో మందు బిల్లలతో ప్రాబ్లమ్‌ని అప్పటికప్పుడు కవర్ చేస్తాం. ఇదే మనల్ని ఫ్యూచర్లో డేంజర్ జోన్లో పారేస్తుంది. మనకి తెలిసితెలియకుండా వేసుకునే మందులు , ఆ మందులు వాడే విధానం కారణంగా కాలేయ కణాలను దెబ్బతీసే పదార్థాలు ఉత్పతి అవుతాయి. దీంతో దీంతో లివర్ ఇంజ్యూర్(DILI) అనే సమస్యలు వస్తాయి. ఇలా కాకుండా ఏం చేయాలి. లివర్ని ఎఫెక్ట్ చేసే సాధారణ మందులు, ప్రోడక్ట్స్‌లో కొన్ని ఉన్నాయి. అవి నొప్పి నివారణ మందులు : పారాసెటమాల్ని మనం సజెస్ట్ చేసిన దానికంటే హై డోస్‌లో తీసుకుంటే లివర్‌పై ఎఫెక్ట్ పడుతుంది. డైక్లోఫెనాక్, ఇబుప్రోఫెన్, నాప్రోక్సెన్ వంటి కొన్ని NSAIDలు కూడా లివర్‌పై ఎఫెక్ట్ చూపించి లివర్ పాడయ్యేలా చేస్తాయి. అమోక్సిసిలిన్ - క్లావులనేట్, టెట్రాసైక్లిన్లు, ఎరిథ్రోమైసిన్ సహా కొన్ని యాంటీ బయాటిక్స్ లివర్ గాయంతో సంబంధాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి, వీటి జోలికి వెళ్లకూడదు. ఒకవేళ వేసుకోవాలనుకుంటే ముందుగా డాక్టర్ సలహా తీసుకుని వాడడం మంచిది. వారే మీరు ఆ ట్యాబ్లెట్స్‌ని ఎప్పుడు తీసుకోవాలి? ఎలా తీసుకోవాలి? డోస్ ఎంత అనే విషయాలన్నింటినీ క్లియర్‌గా చెబుతారు. సాధారణంగా హెర్బల్ అనగానే ఎలాంటి నెగెటీవ్ ఇంపాక్ట్ ఉండవుగా అని వాడుతాంటరు. కానీ, వీటిలో బరువు తగ్గడం, బాడీ బిల్డింగ్ కోసం వాడే ప్రోడక్ట్స్, కొన్ని గ్రీన్ టీ సారం, అనాబాలిక్ స్టెరాయిడ్స్ సహా కాలేయాన్ని పాడుచేయొచ్చు. అందుకే, వీటిని ఎలా వేసుకోవాలో అలానే వేసుకోవాలి. అంతేకానీ, ఏ మాత్రం తప్పుడు విధంగా వాడొద్దు. మనం ఎప్పుడైనా సరే సొంతంగా మందులు వాడొద్దు. ఆల్రెడీ లివర్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు ఒకటి కంటే ఎక్కువ మందులు తీసుకుంటున్నా, మీరు వాడుతున్న ప్రతి ప్రిస్క్రిప్షన్, సప్లిమెంట్స్ గురించి ప్రతీసారి డాక్టర్ని అడిగి తెలుసుకోండి. మందులు వాడిన తర్వాత లివర్ ప్రాబ్లమ్‌కి సంబంధించిన ఎలాంటి లక్షణాలు కనిపించిన లివర్ టెస్ట్ చేయించుకోవడం ముఖ్యమని గుర్తుంచుకోండి. సమయం తెలుగు సంప్రదించిన వైద్య నిపుణులు హెపటాలజిస్ట్ అండ్ థెరపెటిక్ ఎండోస్కోపిస్ట్ యశోద హాస్పిటల్స్, హైదరాబాద్





