Sanju Samson: 2028 టీ20 ప్రపంచకప్‌లో ఆడబోయే టీమిండియా ఎలా ఉండబోతుందనే దానిపై క్రికెట్ ఫ్యాన్స్ ఇప్పట్నుంచే ఒక క్లారిటీ తెచ్చుకుంటున్నారు. అయితే జట్టు ఎంపికలో ముఖ్యంగా ఓపెనింగ్ కాంబినేషన్ ఎవరికి దక్కుతుందనే ప్రశ్న ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ప్రస్తుత టీ20 సిరీస్‌లోని రెండు మ్యాచ్‌లలోనూ సంజు శాంసన్‌కు ఓపెనర్‌గా అవకాశం దక్కగా, యంగ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీ బెంచ్‌కే పరిమితమయ్యాడు. ఈ నేపథ్యంలో అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు తనకు గట్టి పోటీదారులుగా ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సంజు శాంసన్ చాలా మెచ్యుర్డ్ గా బదులిచ్చారు. మనమంతా దేశం కోసమే ఆడుతున్నామని, దేశమే ఎప్పుడూ ముందుంటుందని ఆయన తేల్చిచెప్పారు.