

Sanju Samson : టీమ్ఇండియా క్రికెటర్ సంజూ శాంసన్‌కు (Sanju Samson) ఘోర అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుతోంది. కేరళ క్రికెట్ లీగ్ 2026 ఫైనల్ బహుమతి ప్రధానోత్సవానికి సంబంధించిన వీడియోగా తెలుస్తోంది. ఈ టోర్నీ ఫైనల్ మ్యాచ్ ముగిసిన తరువాత ప్రజంటేషన్ వేడుకలో భాగంగా టీమ్ఇండియా మాజీ ఆటగాడు శ్రీశాంత్ వేదికపైకి వెళ్లాడు. అక్కడ ఉన్న అందరితోనూ అతడు కరచాలనం చేశాడు ఒక్క సంజూ శాంసన్‌తో తప్ప.
వీడియోలో ఏం ఉందంటే? ఈ వీడియో వైరల్ అవుతుండగా ఇద్దరు భారత ఆటగాళ్ల మధ్య విభేదాలు తలెత్తాయని, సంజూను కూరలో కరివేపాకును తీసివేసినట్లుగా తీసివేశాడని పలువురు కామెంట్లు చేస్తున్నారు. దీనిపై అటు సంజూ శాంసన్ గానీ, ఇటు శ్రీశాంత్ గానీ స్పందించలేదు.
Sreesanth and sanju Samson ignored the hand snakes between each other in kcl final ?….
Any Rift??#KCL #SANJU pic.twitter.com/UbteQpw6nl
ప్రజంటేషన్ వేడక సందర్భంగా అధికారులతో పాటు సంజూ శాంసన్ వెళ్లి స్టేజీపై ట్రోఫీ పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పుడు శ్రీశాంత్ వేదికపైకి వచ్చాడు. సంజూ వైపు కన్నెత్తి కూడా చూడలేదు. శాంసన్ పక్కన నిలబడి ఉన్న ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. సంజూను కనీసం పట్టించుకోలేదు.





