
ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ సంప్రదాయాలంటే తనకెప్పుడు గౌరవమేనని అంటున్నారు అగ్ర కథానాయిక సమంత. ( Samantha ) ప్రస్తుతం ఆమె గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సమంతకు ‘గోద్‌ భరాయి’ (సీమంత) వేడుకను ఘనంగా నిర్వహించారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలను సమంత ఇన్‌స్టా వేదికగా పంచుకున్నారు. ‘‘మన సంప్రదాయాలంటే నాకెప్పుడూ గౌరవమే. ప్రతి ఆచారం వెనుక ఉన్న అంతరార్థాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోకపోవచ్చు, కానీ, వాటి వెనుక ఏదో బలమైన శక్తి, అంతర్లీనమైన అర్థం ఉందని నేనెప్పుడూ నమ్ముతా. మంత్రోచ్చారణ ద్వారా వెలువడే శక్తిలో, తరాలుగా ఎంతో శ్రద్ధతో అనుసరిస్తున్న ప్రాచీన ఆచార విధానాల్లో ఆ లోతైన భావం దాగి ఉందని నాకు అనిపిస్తుంది’’ అని అన్నారు. .నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.





