
సర్గం రవి కుమార్. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. Revanth Reddy: 'రెండోసారి 117 సీట్లు గెలుస్తున్నాం. కేసీఆర్‌ది కుటుంబ న్యాయం, నాది సామాజిక న్యాయం. కేసీఆర్‌ది దొరల న్యాయం, మాది సామాజిక న్యాయం. చెట్టుకు, పుట్టకు, రాయి, రప్పకు మొక్కుతున్నారు కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని. వందల ఎకరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, కవిత ఫామ్‌హౌస్‌లు కట్టుకున్నారు' అని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. తాము గ్రామగ్రామాన ఏడు లక్షల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తున్నట్లు చెప్పారు. దిశ సరిగా లేకపోతే దశ సరిగా ఉండదని.. ఆలోచన చేసి నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటుచేసిన సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరణ సభలో ముఖ్యమంత్రి కీలక ప్రసంగం చేశారు. 'ప్రభుత్వ పాఠశాలల్లో సన్న బియ్యంతో భోజనం పెడుతున్నాం. నాణ్యమైన అల్పాహారం అందిస్తున్నాం. పాలు, రాగిజావ పిల్లలకు ఇస్తున్నాం. మన పిల్లలు రాజ్యాలు ఏలాలంటే చదువు ఒక్కటే పరిష్కారం. కష్టమైనా, నష్టమైనా పిల్లలను బడికి పంపించాలి. వాళ్లను చదివించే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది' అని రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రమాదవశాత్తు గౌడ సోదరులు చనిపోతే రూ.5 లక్షల పరిహారం చెల్లిస్తున్నట్లు వెల్లడించారు. 'అందెశ్రీ పాటకు విముక్తి కల్పించాం. గద్దర్ పేరును శాశ్వతంగా నిలిపాం. బీసీ కులగణన చేశాం. ఎస్సీ వర్గీకరణ చేశాం. నిరంతరం ప్రజల కోసం పనిచేస్తున్నాం. 36 వేల కోట్ల రూపాయల రైతు భరోసా ఇచ్చాం. 95 వేల కోట్ల రూపాయలతో ధాన్యం కొనుగోలు చేశాం. 60 వేల కోట్ల బ్యాంకు అనుసంధాన రుణాలను మహిళా సంఘాలకు ఇచ్చాం' అని ముఖ్యమంత్రి వెల్లడించారు. 'యంగ్ ఇండియా సమగ్ర పాఠశాలలను ప్రతి నియోజకవర్గంలో 200 కోట్ల