
రెగ్యులర్ గా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్న పూరి జగన్నాధ్ కూతురు పవిత్ర తాజాగా తన ట్యాలెంట్ ని బయటపెట్టింది. తనకు బొమ్మలు గీసే కళ ఎక్కడా నేర్చుకోకుండానే వచ్చిందని, గత సంవత్సరం కేదారనాథ్ శివుడు కలలోకి వచ్చాడని, ఆ తెల్లారే కలం పెట్టి ఆలయ నమూనాను గీయడం మొదలుపెట్టానని, అది పూర్తయినప్పుడు చాలా ప్రశాంతంగా అనిపించిందని తెలిపింది. పవిత్ర తను గీసిన కేదారనాథ్ ఆలయాన్ని చూపిస్తూ దిగిన ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.





