
కమలానగర్: పర్యావరణాన్ని కాపాడుకోకపోతే ఎల్‌నినో వంటి పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుందని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్‌లో ఏపీడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలను, మొక్కలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. ప్రతి మొక్క మహా వృక్షమై పర్యావరణాన్ని కాపాడుతుందని చెప్పారు. జర్నలిస్టులు ప్రత్యేక చొరవ తీసుకొని మట్టి విగ్రహాలు, మొక్కలు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.






