

Pithapuramlo… Ala Modalaindi : ప్రేయసి రావే ఫేమ్ దర్శకుడు మహేష్ చంద్ర చాన్నాళ్ల గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘పిఠాపురంలో… అలా మొదలైంది’ అనే సినిమాతో రాబోతున్నాడు. డా. రాజేంద్రప్రసాద్, పృథ్వీరాజ్, కేదార్ శంకర్, మణిచందన, అన్నపూర్ణమ్మ, సన్నీ అఖిల్.. పలువురు ముఖ్య పాత్రల్లో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ చంద్ర సినిమా టీమ్, ఎవర్ గ్రీన్ ఎపిక్ సినిమా సంయుక్త నిర్మాణంలో దుండిగళ్ళ బాలకృష్ణ, ఆకుల సురేష్ పటేల్, ఎఫ్.ఎం. మురళి నిర్మాణంలో మహేష్ చంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.
తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని ప్రకటించారు. ఈ సినిమా సెప్టెంబర్ 18న ప్రముఖ నిర్మాణ సంస్థ ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ ద్వారా రిలీజ్ అవ్వనుంది.






