© 2026 nimisham.in

ఇంటర్నెట్ డెస్క్: తన భర్త, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు అన్నా కొణిదెల పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా ఓ క్యూట్ ఫొటో పంచుకున్న ఆమె.. ఆకట్టుకునే క్యాప్షన్ రాశారు. ‘‘ఈరోజు మీ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మీరు ఎంతోమంది హృదయాల్లో, వారి ఆలోచనల్లో, వారి ప్రార్థనల్లో ఉన్నారు. ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపారు. వాళ్లకు ఎంతో సాయం చేశారనడానికి వారి గుండెల్లో మీ స్థానమే నిదర్శనం. హ్యాపీ బర్త్‌డే’’ అంటూ లవ్ ఎమోజీతో అన్నా తన ప్రేమను తెలిపారు. ఈ పోస్ట్ క్షణాల్లో వైరల్ కాగా.. పవన్ (Pawan Kalyan) అభిమానులు కామెంట్స్‌లో ఆయనకు విషెస్ చెబుతున్నారు. పవన్ పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ బోర్డ్ ఛైర్మన్, ఎమ్మెల్సీ నాగబాబు పవన్ పేరిట మారేడు మొక్క నాటారు. మారేడు దళాలంటే శివుడికి ఇష్టమని.. సనాతన ధర్మాన్ని ఇష్టపడే పవన్‌కు ఇదే తన కానుక అని చెప్పారు. నేడు తాను 20 మొక్కలు నాటినట్లు వెల్లడించారు. పవన్ అభిమానులంతా కూడా ఈరోజు ఒక మొక్క నాటాలని నాగబాబు (Nagababu) పిలుపునిచ్చారు. గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు
.