
ఇంట్లో ఎంత అందమైన ఫర్నిచర్ ఉన్నా.. చెక్కకు చెదలు పట్టాయంటే దాని రూపమే కాదు, బలం కూడా క్రమంగా దెబ్బతింటుంది. ముఖ్యంగా వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉండటం, తేమ పెరగడంతో చెక్కలో తేమ నిలిచిపోవచ్చు. దీనివల్ల చెదలు, ఇతర కీటకాలు చెక్క ఫర్నీచర్‌ను పాడు చేసే అవకాశం ఉంది. మొదట్లో చిన్న చిన్న రంధ్రాలు, చెక్క పొడి కనిపించడం వంటి లక్షణాలు మాత్రమే కనిపించినా.. సమస్యను నిర్లక్ష్యం చేస్తే క్రమంగా ఫర్నిచర్ పాడుకావొచ్చు.అందుకే చెదల ఆనవాళ్లు కనిపించిన వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. ఇంట్లోనే కొన్ని సాధారణ పద్ధతులతో చెక్క వస్తువులకు చెద పట్టకుండా కాపాడవచ్చని SJST అధ్యయనం పేర్కొంది. అయితే చెదల సమస్య ఎక్కువగా ఉంటే ఇంటి చిట్కాలపై మాత్రమే ఆధారపడకుండా నిపుణుల సహాయం తీసుకోవడం మంచిది.చెక్క ఫర్నిచర్‌కు ఎండ తగలనివ్వండిచెక్కలో తేమ ఎక్కువగా ఉండటం చెదలకు అనుకూల వాతావరణాన్ని కల్పిస్తుంది. కదిలించగలిగే చిన్న చెక్క ఫర్నిచర్‌ను వీలైనప్పుడు సూర్యరశ్మి తగిలే ప్రదేశంలో ఉంచితే చెక్కలోని తేమను తగ్గించవచ్చు. అయితే ఎక్కువసేపు తీవ్రమైన ఎండలో ఉంచితే కొన్ని చెక్క వస్తువుల పాలిష్ దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫర్నిచర్ నిపుణుల సూచనలను పరిగణనలోకి తీసుకోవాలి.తడి కార్డ్‌బోర్డ్‌తో ట్రాప్ పెట్టండిచెదలు సెల్యులోజ్ ఉన్న పదార్థాల వైపు ఎక్కువగా ఎట్రాక్ట్ అవుతాయి. అందుకే తడి కార్డ్‌బోర్డ్‌ను చెదల ఆనవాళ్లు కనిపించే ప్రదేశానికి దగ్గరల్లో ఉంచి కొంతమంది వాటికి ట్రాప్‌ను క్రియేట్ చేస్తారు. చెక్కలో ఉన్న చెదలు కార్డ్బోర్డ్లో చేరతాయి. కార్డ్బోర్డ్లో చెదలు కనిపిస్తే దాన్ని ఇంటి నుంచి దూరంగా పారవేయాలి. అయితే ఇది చెదల కాలనీని పూర్తిగా తొలగించదు.వేపనూనెతో చెదలు నివారించండివేపనూనెను సహజ కీటక నివారిణిగా పనిచేస్తుంది. మీ ఇంట్లో చెక్కవస్తువులకు చెదలు పడితే చెక్క అంచులపై తగిన విధంగా వేపనూనె అప్లై చేయండి. అయితే ముందుగా ఫర్నిచర్‌పై కనిపించని చిన్న భాగంలో టెస్ట్ చేయడం మంచిది. పాలిష్ లేదా పెయింట్‌పై మరకలు పడే అవకాశం ఉన్నందున నేరుగా పెద్ద ప్రాంతంలో ఉపయోగించకూడదు.వెనిగర్-నిమ్మరసం మిక్స్వెనిగర్, నిమ్మరసంతో తయారు చేసిన ద్రావణం చెదలు నివారించడానికి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. చెదలు కనిపించిన ప్రదేశంలో ఈ మిశ్రమం అప్లయ్ చేస్తే చెదలను నివారించవచ్చు. అయితే ఏదైనా ద్రావణాన్ని ఉపయోగించే ముందు ఫర్నిచర్లో కనిపించని చిన్న ప్రదేశంలో పరీక్షించాలి. లేదంటే పాలిష్, పెయింట్, చెక్క ఉపరితలం దెబ్బతినే అవకాశం ఉంటుంది.తేమను తగ్గించడం ముఖ్యంచెక్క ఫర్నిచర్‌ను ఎక్కువకాలం కాపాడుకోవాలంటే చెదలు కనిపించిన తర్వాత మాత్రమే చర్యలు తీసుకోవడం కాకుండా.. ఇంట్లో తేమను నియంత్రించడం, లీకేజీలను వెంటనే సరిచేయడం, ఫర్నిచర్‌ను క్రమం తప్పకుండా పరిశీలించడం వంటి ముందస్తు జాగ్రత్తలు పాటించడం మంచిది. చెదల నివారణలో ఇంటి పరిసరాలను పొడిగా ఉంచడం కూడా కీలకం. ఫర్నిచర్‌ను తడి గోడలకు చాలా దగ్గరగా ఉంచకుండా గాలి ప్రసరణ ఉండేలా చూడాలి. చెక్కలో లోతుగా చెదలు పాకడం, ఎక్కువగా చెక్క పొడి కనిపించడం, ఫర్నిచర్ బలహీనపడటం వంటి లక్షణాలు కనిపిస్తే ప్రొఫెషనల్ పెస్ట్ కంట్రోల్ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.ముఖ్య గమనిక: ఈ కథనంలోని సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. కొన్ని అధ్యయనాలు, కొందరు నిపుణులు పేర్కొన్న అంశాల ఆధారంగా తెలియజేశాము. వీటిని పాటించే ముందు నిపుణుల సలహా తీసుకోండి. అలాగే వీటిని ఎంత వరకు పాటించాలనేది, విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం. సమయం తెలుగు వీటిని ధృవీకరించడం లేదు.





